సీజన్ మార్పు వల్ల వైరల్ ఫీవర్ ప్రబలుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి ఈటల అన్ని ఆస్పత్రులు సందర్శించారని చెప్పారు. సోమవారం ఉదయం అయన ఎంయుఏడి పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మెరుగైన సేవలు ఎలా ఉండాలి అనే దానిపై ఈ సమావేశంలో చర్చించామని చెప్పారు. బల్దియాలోని అన్ని విభాగాల అధికారులతో సమావేశమయ్యారు.  నగర ప్రజలు డెంగీ పై ఆందోళన చెందుతున్నారని చెప్పారు.  సీజన్లలో వచ్చే వ్యాదుల నివారణ, చర్యలపై క్యాలెండర్ ను రూపొందించాలని బల్దియాను కోరినట్టు తెలిపారు. సీజన్‌లో వచ్చే వ్యాధులపై  ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి డిప్యూటీ కమీషనర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం  రోజుకు‌ మూడు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.



పాఠశాలలు, మురికివాడలలో పాటుగా అపార్ట్‌మెంట్ లో సదస్సులు నిర్వహించాలని సూచించారు. అక్కడ వ్యాధులు ఎలా వస్తాయనే అంశంపైన అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా  నీరు నిల్వ ఉండకుండా చూడాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఏదిఏమైనా ప్రజల భాగస్వామ్యం లేనిది ఏమి జరగదన్నారు. 16వ తేది వరకు ఓపెన్ గార్బేజ్ పాయింట్లను తొలగించాలి. నగర వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలి.. నగరంలో 106 ‌బస్తీ దవాఖానులు ఉన్నాయన్నారు. ఆయా ఆరోగ్య కేంద్రాల్లో  సాయంత్రం ఓపీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్  అనుమతితో బస్తీ దవాఖానల సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ విషయంలో  తాను, ఆరోగ్య శాఖ మంత్రి, మేయర్ సంయుక్తంగా  భాగస్వాములమవుతామని  చెప్పారు.




స్కూల్లు, కాలేజీల్లో వ్యాదుల నివారణకు తీసుకోవాల్సిన వాటిపై అవగాహన కల్పించాలి. నిర్మాణ వ్యర్దాలకు సంబందించి జీడిమెట్లలో పరిశ్రమ ప్రారంభమైంది. నిర్మాణ వ్యర్దాలను రోడ్లపై వేసే వారిపై కటిన చర్యలు తీసుకోవాలి, అవసరమైతే బండ్లను సీజ్ చేయాలి. వర్షం వల్ల రోడ్లు చాలా దెబ్బతిన్నవి.సానిటేషన్, రోడ్లపై గుణాత్మక మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నరు. అందరు విస్తృతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించాలి. అన్ని జ్వరాలు డెంగీ కావు, లేని భయాలను మీడియా కల్పించవద్దు.వ్యాది తగ్గుముఖం పట్టిన మాట వాస్తవం. ఇంకా తగ్గుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: