వంశీ నువ్వు ఎమ్మెల్యే పదవికి, తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేశావా. లేదా. చేస్తే.. ఆ పార్టీ  అధిష్టానం ఆమోదించారా అంటూ గన్నవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల వై.సి.పి.అధ్యక్షులు ప్రశ్నించారు. శనివారం రాత్రి స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ప్రశ్నలను గన్నవరం ఎమ్మెల్యే వంశీ పై సంధించారు. వై.సి.పి.ఆవిర్భావం నుంచి ఇతర పార్టీలలోగెలిచిన వారు  ఆపదవికి రాజీనామా చేసిన తరువాతే వై.సి.పిపార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఈ నియమాన్ని తప్పే ప్రసక్తే లేదని వైకాపా నేతలు స్పష్టం చేశారు. నీ స్వార్ధం కోసం  మైండ్ గేమ్ ఆడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నావంటూ వంశీపై ధ్వజమెత్తారు. వై.సి.పిలో చేరకుండానే ఫ్లెక్సీలో సీఎం. ఫొటోతో పాటు నీ ఫోటో ముద్రించి నీ అనుచరులతో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయిస్తున్నవని ఎద్దేవా చేశారు.



నువ్వు టిడిపి నుంచి వెళ్లిపోయావని ఆ పార్టీ వారు సంతోషంగా దీపావళి చేసుకున్నారని విమర్శించారు. 5  నెలలు అధికార పక్షంలో లేకపోతే రాజకీయ జీవితంలో ఉండలేని నీ లాంటి స్వార్ధపరుడు వై సి.పి కి అవసరం లేదన్నారు. నీ మైండ్ గేమ్ రివర్స్ అయ్యిందని ఎద్దేవా చేశారు. టిడిపిలో నిన్ను నమ్మరని, వై.సి.పిలో చేర్చుకోరన్నారని తేల్చి చెప్పారు. నువ్వు అడ్డ గోలుగా సంపాదించుకున్నా టిడిపి నిన్ను వదిలేదిందన్నారు. నువ్వు పార్టీ మారినంత మాత్రాన పెట్టిన కేసులు పోవన్నారు. సమాధానం చెప్పి తీరాల్సిందేనన్నారు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే తప్పదన్నారు. వంశీ టిడిపిలో ఉన్నంత కాలం వేసి.సి.పి.నాయకులు, కార్యకర్తల పై కేసులు నమోదు చేయించి వేధించారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రతి పక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, కాకులపాడు పొలాలు చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన పై కూడా కేసులు నమోదు చేయించిన ఘనుడవు నీవన్నారు.


సి.ఎం. జగన్ నిన్ను ఎప్పటికీ మర్చిపొరన్నారు. వంశీ బాధితులు ఒక్కొక్కరూ మీడియా ముందుకు వస్తుంటే వారిని బెదిరించే విధంగా తాబేదారులతో ఫిర్యాదు చేయిస్తున్నవాని చెప్పారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు ఎన్నికల గొడవను పోలీదులు ఐ.పి.సి.324 సెక్షన్ కేసును వారిపై ఒత్తిడి తెచ్చి307 సెక్షన్ గా మార్పించి వై.సి.పి.నాయకుల పై కేసు నమోదు చేయించినట్టు తెలిపారు.అక్రమ కేసులు బనాయించడం, వేధింపులకు గురి చేయడం వంశీకి వెన్నతో పెట్టిన విధ్యేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం, ఉంగుటూరు మండలాల అధ్యక్షులు తులిమిల్లి ఝాన్సీ,వింత శంకర్ రెడ్డి, గన్నవరం పట్టణ అధ్యక్షుడు మద్దినేని వెంకటేశ్వరావు, కానుమోలు సొసైటీ  చిన్నాల గణేష్,దావాజిగూడెం అధ్యక్షురాలు బడుగు ఝాన్సీ,విజయ్ తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: