దాదాపుగా రెండు వారాలపాటు మహారాష్ట్రలో ఉన్న టెన్షన్ ఇప్పుడు దాదాపుగా తగ్గిపోయింది. ఎట్టకేలకు అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.  కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.  సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో అనేక మలుపులు ఏర్పడ్డాయి.  ఈ మలుపులు అన్ని ఇన్ని కాదు... ఎన్సీపీ లీడర్ అజిత్ పవర్ ప్లేట్ ఫిరాయించి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.  దీంతో మహా వికాస్ అఘాడి షాక్ అయ్యింది.  ఇది అన్యాయం అక్రమం అంటూ నిరసించింది.

 
అయితే, బీజేపీ ప్రభుత్వానికి 14 రోజుల గడువు ఇచ్చింది.  కానీ, ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు సుప్రీం కోర్టుకు వెళ్లాయి.  సుప్రీం కోర్టు మరుసటి రోజే బల నిరూపణ చేసుకోవాలని తీర్పు ఇవ్వడంతో ఫడ్నవీస్ రాజీనామా చేశారు. రాజీనామా చేయడంతో ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఈ ప్రమాణ స్వీకారం పూర్తైన తరువాత శరద్కొన్ని కీలక విషయాలను బయట పెట్టిన సంగతి తెలిసిందే.  


అజిత్ పవార్... ఫడ్నవీస్ ల మధ్య ఉన్న స్నేహం తనకు తెలుసు అని చెప్పిన శరద్ పవార్, ప్రధాని మోడీ ఇచ్చిన అఫర్ ను తాను తిరస్కరించానని చెప్పారు. అదే విధంగా సుప్రియ సూలే కు కేంద్రమంత్రి పదవి ఇస్తామని చెప్పినా తిరస్కరించినట్టు చెప్పారు.  బీజేపీ తో కలిసి పనిచేయడం కంటే, శివసేనతో కలిసి పనిచేయడం ఈజీగా ఉంటుందని అన్నారు.  


ఇక ఇదిలా ఉంటె, శరద్ కుమార్ ఓ బాంబు కూడా పేల్చారు.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం అజిత్ కు ఇష్టం లేదని, కాంగ్రెస్ పార్టీ డిమాండ్లను చూసి అజిత్ షాక్ అయ్యాడని,  44 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్లు సరైనవి కాదని, గొంతెమ్మకోరికలు కోరుతుందని అందుకే అజిత్ పవార్ తిరుగుబాటు చేశాడని శరద్ పవార్ చెప్పారు.  దీన్ని బట్టి ఎన్సీపీ, కాంగ్రెస్ మైత్రి ఎన్నిరోజులు అన్నది ప్రశ్నర్ధకంగా మారింది.  ఒకవేళ కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే.. కాంగ్రెస్ పార్టీ ప్లేట్ ఫిరాయించవచ్చు.  ఇదే జరిగితే మరలా మహా సంక్షోభం తప్పదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: