హైదరాబాదులోని గచ్చిబౌలిలో గత నెల 23న బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీదుగా వస్తున్న ఒక కారు అదుపుతప్పి.. కింద ఉన్న నిస్సాన్ షోరూమ్ ఎదుట పడింది. కారు వేగం అత్యధికంగా ఉండడంతో పడిన కారు.. పల్టీలు కొడుతూ ఒక చెట్టుని భీకరంగా ఢీకొట్టింది. ఆ చెట్టు కింద బస్సు కోసం ఎదురు చూస్తున్న సత్యవేణి(56) తల, ఛాతి భాగాలు తీవ్రంగా చిధ్రమై అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కారు డ్రైవర్ కల్వకుంట్ల కృష్ణమిలాన్ రావు.. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగా ఓ మహిళ మృతికి కారకుడయ్యాడని, అతనిపై అభియోగం మోపి వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ దుర్ఘటన చోటు చేసుకొని రెండు వారాలు పైన అవుతున్నప్పటికీ, నిందితుడిని పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదు. అయితే ఆక్సిడెంట్ అయినప్పుడు నిందితుడు కూడా గాయపడ్డాడు. దీంతో అతను శనివారం వరకు గచ్చిబౌలి లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొంది.. ఆదివారం రోజు డిశ్చార్జ్ అయ్యాడని వార్తలు వెల్లువెత్తాయి. కానీ నొప్పులు తగ్గలేదంటూ, ఫీజియోథెరపీ చికిత్సని తీసుకుంటున్నాని నిందితుడు చెప్తూ.. ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నాడు. నిందితుడు హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి అతన్ని అరెస్టు చేయడం కుదరదని పోలీసులు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. దాదాపు 20 రోజులు అవుతున్నప్పటికీ నిందితున్ని అరెస్టు చేయకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన కేసు హై కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కల్వకుంట్ల కృష్ణమిలాన్ రావు తరుపు న్యాయవాది మాట్లాడుతూ... ఫ్లైఓవర్‌ డిజైన్‌ లో లోపం ఉందని, ఘటన జరిగిన ప్రాంతంలో...ప్లై ఓవర్ మలుపు 'ఎస్' అనే ఆంగ్ల అక్షర ఆకారంలో ఉండటం వలనే ఈ ప్రమాదం జరిగిందని, తన క్లయింట్ కేవలం గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతోనే కారు నడుపుతున్నాడని తెలిపాడు. అయితే, నిందితుడు తన తప్పిదమేని లేదని, డిజైన్ లోపమే కారణమన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోర్టు ఆదేశించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: