తెలంగాణలో విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థలను నష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం ఓ వైపు చర్యలు చేపడుతున్నా.. ఏ ఏడాదికా ఏడాది నష్టాలు పెరుగుతున్నయే తప్ప తగ్గడం లేదు. ఫలితంగా ప్రభుత్వం పథకాల అమలు కష్టమవుతోంది. దీంతో కొన్ని క్యాటగిరిల్లో విద్యుత్ చార్జీలు పెంచాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి డిస్కమ్‌లు. అయితే, ప్రతిపాదనలను నవంబర్ చివరికే విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాల్సి ఉండగా... ఇ.ఆర్.సి డిసెంబర్ చివరి నాటికి దాని గడువును పెంచింది.

 

2020లో కరెంటు చార్జీలను ఎంతోకొంత పెంచేందుకు కసరత్తు చేస్తున్నాయి తెలంగాణలోని డిస్కమ్‌లు. అందుకోసం సీఎం కేసీఆర్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ సీఎం వద్దంటే పెంపు ప్రతిపాదనలు లేకుండానే ఇ.ఆర్.సికి నెలాఖరులోపు నివేదిక అందించనుంది. మరోవైపు.. విద్యుత్ చార్జీలు పెంచకుంటే.. ఆదాయ, వ్యయాల మధ్య లోటు 11 వేల రూపాయలకు చేరుతుందని లెక్కలేస్తున్నాయి అధికారవర్గాలు. గతేడాదిలో 45 వేల 832 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొంటే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరునెలల్లోనే 32 వేల 463 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేశాయి. దీంతో డిస్కమ్‌ల లోటు 11వేల కోట్లకు చేరుకుంది. గృహాల్లో విద్యుత్ వినియోగానికి యునిట్‌కు 6 రూపాయలకు, వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వడం వల్లే ఈ నష్టాలున్నాయంటాయని అంచనా వేస్తున్నాయి డిస్కమ్‌లు. 

 


తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ వినియోగించే గృహాల కనెక్షన్లు కోటి పది లక్షలుండగా.. వాటిలో 50 యూనిట్లలోపు వాడే కనెక్షన్‌లు 38 లక్షల వరకు ఉన్నాయి. లక్షకు అటుఇటుగా పరిశ్రమల కనెక్షన్‌లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కరెంట్ యూనిట్ వ్యయం 6.20 పైసలు దాటుతోంది. 50 యూనిట్లలోపు వాడేవారికి రూపాయి 45 పైసలకి, 51 నుంచి 100 యూనిట్లు వాడేవారికి 2.60 పైసలు ఇవ్వడం వల్ల నష్టం వాటిల్లుతోందని లెక్కలు వేస్తున్నారు అధికారులు. 

 


పరిశ్రమల నుంచి ఇప్పటికే అధిక విద్యుత్ చార్జీలు వసులు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా గృహాలకు చార్జీలు పెంచకుంటే.. ఆ భారం కాస్తా ఎక్కవగా విద్యుత్ ఎక్కువగా వినియోగించేవారిపై పడుతుందని, అలా చేస్తే.. వారు కాస్తా సౌరవిద్యుత్, ఓపెన్‌ యాక్సిస్‌ వైపు వెళ్లే ప్రమాదముందని, దాని వల్ల ఇంకా డిస్కమ్‌లు నష్టపోయే అవకాసముందని భావిస్తున్నారు అధికారులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: