ప్రజాప్రతినిధులు ఆటవిడుపు కోసం రకరకాల పనులు చేస్తుంటారు.  కొందరు సామజిక సేవలు చేస్తుంటే.. మరికొందరు వేరే వేరే రంగాల్లోకి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు.  మరికొందరు ఆటవిడుపు కోసం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు చెక్కేస్తుంటారు.  ఇవన్నీ ఆటవిడుపులో భాగమే.  మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తులు మాత్రం కొన్ని రకాల పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు.  కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి చేసిన టిక్ టాక్ వీడియో ఎంతగా క్లిక్ అయ్యిందో చెప్పక్కర్లేదు.  


ఏపీ సీఎంపై వచ్చిన సాంగ్ ను ఆమె టిక్ టాక్ వీడియోగా చేసి మెప్పించింది.  తనలో ఉన్న ఇన్నర్ టాలెంట్ ను బయటపెట్టింది.  అసలే డిప్యూటీ సీఎం.  ఆపై టిక్ టాక్ వీడియో.. ఇంకేముంది.  వైరల్ అయ్యింది. లక్షలాది మంది ఆ వీడియోను చూశారు.  షేర్ చేశారు.  ఆహా ఓహో అన్నారు.  ఇపుడు ఇదే బాటలో తెరాస ఎమ్మెల్యే కూడా నడుస్తున్నది. తెరాస నల్గొండ ఎమ్మెల్యే ఇటీవలే ఓ వీడియో చేశారు.  ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  


ఇంతకీ ఆ వీడియో ఏమిటంటారా అక్కడికే వస్తున్నా. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తన ఒంటిచేత్తో బాల్స్ ను ఎగరేస్తూ పట్టుకుంటూ వీడియో తీసుకున్నారు.  ఇలా చేయాలి అంటే చాలా టాలెంట్ కావాలి.  సాధారణమైన వ్యక్తులకు సాధ్యం కాదు.  ఎప్పటి నుంచో ప్రాక్టీస్ ఉంటేనేగాని ఇలా చేయలేరు.  ఇక ఒంటిచేత్తో చేయాలి అంటే చాలా కష్టమైన విషయం.  దానిని భూపాల్ రెడ్డి చేసి చూపించాడు.  దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


భూపాల్ రెడ్డి చిన్నతనంలో ఓ ప్రమాదంలో ఎడమ చేతిని కోల్పోవలసి వచ్చింది.  అప్పటి నుంచి కుడిచేయి మీదనే ఆధారం.  ఒక్క చేత్తోనే ఈ ఫిట్ సాధించడం విశేషం.  భూపాల్ రెడ్డి చేసిన ఫీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం విశేషం.  భూపాల్ రెడ్డి తెరాస తరపున నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.  కాంగ్రెస్ పార్టీ కంచుకోటను భూపాల్ రెడ్డి బద్దలు కొట్టాడు.    

మరింత సమాచారం తెలుసుకోండి: