అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి అతని పార్టీలోని ఒక ఎమ్మెల్యే డెడ్ లైన్ ఇచ్చాడు అంటే అతను ఎంత ధైర్యవంతుడై ఉండాలి..? అలాంటి ఒక ఎమ్మెల్యే వైసీపీ పార్టీలో ఉండనే ఉన్నాడు. తూర్పు గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా జగన్ కు ఒక హెచ్చరికను జారీ చేశాడు. జగన్ తను అనుకున్న దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అతను పార్టీ నుంచి రాజీనామా చేస్తానని బెదిరించాడు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ప్రస్తుతం దేశంలోనే హాట్ టాపిక్ గా మారిన ఎన్నార్సీ మరియు సిఏఏ బిల్లు అమలు విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకు విధంగానూ స్పందించలేదు. అయితే తూర్పు గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ జగన్ కనుక ఎన్నార్సీ మరియు సిఏఏ బిల్లులకు సపోర్ట్ చేస్తే తాను పార్టీ నుంచి రాజీనామా చేయవలసి ఉంటుందని చెప్పాడు.

 

IHG

 

ప్రస్తుతం ప్రతి ఒక్క రాష్ట్రం సీఏఏ కు మద్దతుగా అయినా లేదా వ్యతిరేకంగా అయినా తమ నిర్ణయం ఏంటో బయటికి చెబుతున్నారు కానీ జగన్ ఇప్పటివరకు దానిపై ప్రజల్లో మాట్లాడింది లేదు. అయితే సీఏఏ ను అడ్డుకునేందుకు రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేకపోయినా వారు మాత్రం తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో అమలు చేయాలా వద్దా అన్నది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి దానికి అడ్డుకునే శక్తి అయితే లేదు.

 

IHG

 

ఎందుకంటే దేశ పౌరసత్వాన్ని సంబంధించిన విషయాలను తీసుకునే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంది. అందుకే మనకి ఆధార్ కార్డు ని కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఇకపోతే నిన్న అతడు నియోజకవర్గంలో జరిగిన మైనారిటీ కాన్ఫరెన్స్ లో ముస్తఫా మాట్లాడుతూ జగన్ ప్రజలకు నష్టం చేకూర్చే నిర్ణయాలు ఏమీ తీసుకొడని అతను ఆశిస్తున్నట్లు చెప్పాడు. కానీ అతను మాత్రం సీఏఏ కు సమర్థిస్తూ తను అనుకున్నంత పని చేస్తానని జగన్ కు గట్టి హెచ్చరికనే పంపాడు. అయినా ఇక్కడ జగన్ వ్యతిరేకించినా కేంద్ర ప్రభుత్వం పట్టు బట్టి ఉంది కాబట్టి దాని అమలుని ఆపలేం. ముస్తఫా లాజిక్ తో ఇలా మాట్లాడాడో అతనికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: