కేంద్రం దేశవ్యాప్తంగా కొత్త కరెంట్ చట్టాన్ని అమలులోకి తీసుకురానుంది. ఈ చట్టాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ చట్టంపై వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ చట్టం వల్ల రైతులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టం 2020 ముసాయిదా బిల్లులో ఎన్నో ముఖ్యాంశాలు ఉన్నాయి. 
 
ఈ బిల్లు అమలులోకి వస్తే గృహ వినియోగదారులు తప్పనిసరిగా పూర్తి స్థాయి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రభావం 97.6 లక్షల కుటుంబాలపై పడనుంది. ఈ బిల్లు అమలులోకి వస్తే సబ్సిడీలు రద్దవుతాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొందరు 200 యూనిట్ల వరకు విద్యుత్ సబ్సిడీ పొందుతుండగా ఆ సబ్సిడీలు రద్దు కానున్నాయి. సబ్సిడీ పొందుతున్న వారు సైతం బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. 
 
ఈ చట్టం అమలులోకి వస్తే ప్రతి వినియోగదారుడు తాను వినియోగించిన కరెంటుకు ఎంత బిల్లు వస్తే అంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం సబ్సిడీకి అర్హులైన వారికి ఆ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ రూపంలో వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తుంది. తాజా చట్టం అమలులోకి వస్తే క్రాస్ సబ్సిడీ మొత్తం రద్దు కానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 100 యూనిట్ల వరకు రూ. 3.30 పైసల చొప్పున చార్జీలను వసూలు చేస్తున్నారు. 
 
101 - 200 యూనిటల వరకు రూ. 4.30 పైసల చొప్పున బిల్లు వసూలు చేస్తున్నారు. పాత చట్టం వల్ల 200 యూనిట్లలోపు వినియోగించే వినియోగదారులు సబ్సిడీ పొందుతున్నారు. కొత్త బిల్లు అమలులోకి వస్తే యూనిట్ కు రూ. 6.87 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 190 యూనిట్లు వినియోగిస్తే 1366 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త కరెంట్ చట్టం అమలులోకి వస్తే గృహ వినియోగదారులు కరెంట్ బిల్లుకే భారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: