అప్పట్లో యూపీఏ సర్కార్ ఉన్న సమయంలో కనిమొళి గురించి తెలియని వారు ఉండరు.  ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కనిమొళి అప్పట్లో వార్తల్లో ప్రత్యేంగా నిలిచేవారు.  తాజాగా   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, చిరు వ్యాపారుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిమొళి నిన్న తూత్తుకుడి జిల్లాలోని లింగంపట్టి, కోవిల్‌పట్టి భారతీనగర్, ఇందిరానగర్, వానరముట్టి తదితర ప్రాంతాల్లో పర్యటించారు.  తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి సమీపంలోని లింగంపట్టి, కోవిల్‌పట్టి భారతినగర్‌, ఇందిరానగర్‌, వానరముట్టి తదితర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న కార్మికులు, కళాకారులు, నిరోధక చర్య ల్లో శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను ఎంపీ కనిమొళి అందజేశారు.

 

 

అనంతరం  ఆమె మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ను సాకుగా చూపి ప్రజా వ్యతిరేక పథకాలను అమలు చేసేందుకు పళనిస్వామి ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టనున్న ఎనిమిది దారుల రహదారి పథకంపై నిప్పులు చెరిగారు. ఈ పథక అమలుతో రైతులు భూములను కోల్పోవడంతో పాటు ప్రజల జీవనాధారం దెబ్బ తింటుందన్నారు. రైతులు, చిరు వ్యాపారులు, చిన్నతరహా కర్మాగారాల యజమానుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచే ఎలాంటి పథకాలు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేపట్టలేదని ఆరోపించారు. ఇప్పటికీ కొంత మంది నేతలు ప్రజలను మభ్య పెట్టి వారి పబ్బం గడుపుకుంటున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: