ఏపీ సీఎం వైఎస్ జగన్ ది కడప జిల్లా అన్న సంగతి తెలిసిందే. జిల్లా వాసుల చిరకాల వాంఛ కడప స్టీల్ ఫ్యాక్టరీ.. చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ ఇదిగో అదిగో స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు తప్పించి..అడుగు ముందుకుపడలేదు. జగన్ సీఎం అయ్యాక ఈ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో గట్టి పట్టుదలగా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని దానిని ముందుకు తీసుకు వెళ్లే యత్నం చేస్తున్నారు.

 

 

తాజాగా ఈ స్టీల్ ఫ్యాక్టీ కోసం 500కోట్ల రూపాయల ఈక్విటిని పెట్టాలని సీఎం జగన్ అదికారులను ఆదేశించారు. స్టీల్ ప్లాంట్ పై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. ఓ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపిస్తున్న సంస్థలతో అధికారులు ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు.

 

 

కడప స్టీల్ ఫ్యాక్టరీలో భాగస్వామ్యం కోసం హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్సార్‌ స్టీల్‌ సహా పలు కంపెనీలతో అధికారులు చర్చల జరిపారు. వీటిలో ఏవైనా రెండు కంపెనీలతో ఏపీ సర్కారు రెండు నెలల్లో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో రెండు సంవత్సరాల్లో పరిశ్రమకు అనుబంధంగా టౌన్‌షిప్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అనుబంధం మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసుకునే దిశగా ప్లాన్ చేస్తున్నారు.

 

 

మొత్తానికి జగన్ కడప జిల్లా వాసుల కలలను నెరవేర్చే ప్రయత్నంలో సీరియస్ గా ఉన్నారు. గతంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా బ్రహ్మణి స్టీల్ పేరుతో ఫ్యాక్టరీ కోసం ప్రయత్నించినా అనేక కారణాల వల్ల అది సాకారం కాలేదు. అందుకే ఇప్పుడు జగన్ ఆ కల నిజం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: