రాష్ట్రంలో కొత్త జిల్లాల సందడి మొదలైపోయింది. కేసీయార్ బాటలోనే జగన్ కూడా ఇపుడున్న జిల్లాలను రెండున్నర రెట్లు పెంచేందుకు  కసర‌త్తు చేస్తున్నారు.  ప్రతీ  పార్లమెంట్ నియోజకవర్గాన్ని సరిహద్దుగా పెట్టుకున్నా కూడా  చాలా మార్పులు చేర్పులే జరుగుతాయని అంటున్నారు.

 

ఇందులో కొత్త జిల్లాలు ఊహించనివి కూడా వస్తాయని అంటున్నారు. కొత్త జిల్లాల పేర్లు కూడా మారుతాయి. అలాగే ఇపుడున్న జిల్లాల పేర్లు కూడా కొన్ని మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యమైన అంశం ఏంటి అంటే అమరావతి కొత్త జిల్లాగా ఆవిర్భవించడం.

 

అమరావతి రాజధానికి మూడుగా చేస్తున్న జగన్ అమరావతి స్థాయిని కూడా పెంచాలని నిర్ణయించారు. ఇక్కడ ప్రజలు అన్యాయం కాకుండా వారికి ఉన్నత స్థితి కోసం అభివ్రుధ్ధి కోసం అమరావతి పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అదే కనుక జరిగితే గుంటూరు కూడా మూడు ముక్కలవుతుంది అంటున్నారు.

 

ఇక విశాఖ జిల్లా సైతం మూడు ముక్కలుగా మారినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అందులో విశాఖలో సచివాలయం ఉన్న ప్రాంతాన్ని  ఒక జిల్లాగా ఉంటే, మిగిలిన జిల్లా మరో ప్రాంతం, అలాగే ఎజెన్సీలో ఉన్న అరకు ఇంకో జిల్లాగా ఉంటాయని అంటున్నారు. 

 

ఇకా అరకు విషయం తీసుకుంటే దాన్ని రెండుగా విడగొడతారు అంటున్నారు. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి తన సొంత నియోజకవర్గం కురుపాంని  ఏకంగా జిల్లా చేయాలనుకుంటున్నారు. దాంతో అరకు రెండుగా మారుతుంది అంటున్నారు. అయితే పార్వతీపురం, పాలకొండ కూడా కొత్త గిరిజన జిల్లాలు కావాలని అంటున్నాయి మరి చూడాలి.

 

అదే విధంగా కర్నూలు కూడా ప్రత్యేక జిల్లాగా ఉంటుంది. అక్కడ న్యాయ రాజధాని వస్తుంది కాబట్టి ఆ పరిధిని అంతా జిల్లాగా మార్చాలని, మిగిలిన ప్రాంతం మరో జిల్లాగా చేయాలని ప్రతిపాదిస్తున్నారుట. మొత్తం మీద చూసుకుంటే ఇపుడున్న చాలా జిల్లాల స్వరూప స్వభావాలు కూడా మారుతాయని అంటున్నారు.కొన్ని జిల్లాల రూపురేఖలు మొత్తానికి మారినా డౌట్ లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: