దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతుల ఖాతాలలో నగదు జమ చేస్తోంది. కేంద్రం రేపటి నుంచి రైతుల ఖాతాలలో 2,000 రూపాయలు జమ చేయనున్నట్టు ప్రకటన చేసింది. అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమవుతుంది.
 
కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా ప్రతి సంవత్సరం రైతుల ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున మూడు విడతల్లో 6,000 రూపాయలు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఆరో విడత నగదు రేపటినుంచి లబ్ధిదారుల ఖాతాలలో కేంద్రం జమ చేస్తుంది. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ పథకానికి మనం అర్హులమో కాదో సులభంగా తెలుసుకోవచ్చు.
 
2019 ఫిబ్రవరి నెలలో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. మోదీ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హత ఉన్న రైతులందరి ఖాతాలలో నగదు జమవుతుంది. లబ్ధిదారులు తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే మొదట https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లో ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
 
ఒకవేళ వివిధ కారణాల వల్ల ఈ పథకానికి అర్హులైనా వెబ్ సైట్ లో పేరు లేకపోతే వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకుని పథకానికి అర్హత పొందవచ్చు. వెబ్ సైట్ లో దరఖాస్తు చేసిన తరువాత దరఖాస్తు స్టేటస్ ను తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆధార్ కార్డు నెంబర్,బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ సాయంతో దరఖాస్తు స్టేటస్ ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు వినియోగించే వాళ్లు పీఎం కిసాన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: