భారత దేశం సువిశాల దేశం.. ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతుల సమ్మేళం ఈ దేశం. కానీ ఈ దేశంలో అప్పుడప్పుడు మెజారిటీ వాదం రెచ్చిపోతుంటుంది. అది కాస్తా వివాదం అవుతుంటుంది. ఎంపీ కనిమొళి విషయంలో అలాగే జరిగింది. తమిళనాడుకు చెందిన డి.ఎమ్.కె. నేత, లోక్ సభ సభ్యురాలు కనిమొళికి హిందీ విషయంలో ఓ చిత్రమైన, అవమానకరమైన ప్రశ్న ఎదురైంది.


ఆమె ఎయిర్‌పోర్ట్ కు వెళ్లినప్పుడు .. ఓ అధికారి హిందీలో చెప్పింది ఆమెకు అర్థం కాలేదు. ఆమె నాకు హిందీ రాదు. ఇంగ్లీష్ లేదా తమిళంలో చెప్పండి అని అడిగిందట. ఆ అధికారి వెటకారంగా.. హిందీ రాదా.. నువ్వు ఇండియన్ కాదా అని కామెంట్ చేశారట. దీంతో ఆమె మనసు చివుక్కు మంది. తన అనుభవాన్ని ఆమె ట్విట్టర్‌లో పంచుకుంది. హిందీ రాకపోతే ఇండియన్ కారా అంటూ ప్రశ్నించింది. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర సర్కారు బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తోందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.




ఇప్పుడు ఈ ట్వీట్ కలకలం సృష్టిస్తోంది. దక్షిణ భారతీయులు ఆమెకు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. హిందీ ఇంపోజిషన్ ట్యాగ్ తో దీన్ని వైరల్ చేస్తున్నారు. అయితే ఇంకొందరు డీఎంకే భాష ఆధారంగా ఇంకెన్నాళ్లు  రాజకీయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది.




దీనిపై స్పందించిన సీఎస్‌ఐఎఫ్‌ ట్విట్టర్‌లోనే  ఎంపీ కనిమొళికి సారీ చెప్పింది. తగిన చర్య తీసుకుంటామని ప్రకటించింది. వెంటనే స్పందించినందుకు  కనిమొళి కూడా కృతజ్ఞతలు తెలిపారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: