కొత్తగా కారు కొనుగోలు చేయాలని యోచిస్తున్నారా అయితే మీకో అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఇక కారు కోనుగోలుపై వివిధ రకాల ఆఫర్లు ఉన్నాయి. వీటి ద్వారా కాను కొనుగోలుదారులకు ప్రయోజనం కలుగనుంది. నిస్సాన్ కంపెనీ తన కారుపై ఈ ఆఫర్లు ప్రకటించిందని సమాచారం. అయితే నిస్సాన్ కంపెనీ తన కిక్స్ టర్బో కారు కొనుగోలుపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉంచిందని సమాచారం. అంతేకాకుండా రూ.65 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు అందిస్తోందని తెలిపారు. ఆఫర్ అనేది రాష్ట్రం ప్రాతిపదికన మారుతోంది. కొన్ని రాష్ట్రాల్లో బంగారం నాణేలు, రూ.లక్ష వరకు బంగారం గెలుచుకునే ఛాన్స్ వంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయని నిపుణులు వెల్లడించారు.


అంతేకాక నిస్సాన్ కిక్స్ టర్బో కారు కొనుగోలుపై కస్టమర్లు ఎక్స్చేంజ్ కింద రూ.40 వేల వరకు తగ్గింపు పొందొచ్చునని తెలిపారు. ఇక లాయల్టీ ఆఫర్ కింద మరో రూ.15,000 తగ్గింపు లభిస్తుందని తెలిపారు. ఇక కార్పొరేట్ ఆఫర్ కింద మరో రూ.10 వేల తగ్గింపు సొంతం చేసుకోవచ్చునని వెల్లడించారు. ఇక మొత్తంగా రూ.65 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చునన్నారు. ఈ ఆఫర్లు మాత్రమే కాకుండా కారు కొనుగోలుదారులకు లక్కీ డ్రా కూడా ఉంటుందన్నారు. ఇందులో విజేతగా నిలిచిన వారికి రూ.లక్ష వరకు బంగారాన్ని అందిస్తారు. సెప్టెంబర్ నెలలో లక్కీ డ్రా నిర్వహిస్తారని తెలిపారు. ఆగస్ట్ నెలలో కారు కొన్నవారికి ఇది వర్తిస్తుందని తెలిపారు.


అంతేకాకుండా టెస్ట్ అండ్ విన్ 100% క్యాష్‌బ్యాక్ అనే ఆఫర్ కూడా ఉందని తెలిపారు. కారు టెస్ట్ డ్రైన్ చేసి ఫీడ్ బ్యాక్ ఇచ్చి కారు కొనుగోలు చేసిన వారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉందన్నారు. ఇలా ఫీడ్ బ్యాక్ ఇచ్చిన వారికి కూడా లక్కీడ్రా ఉంటుంది. విజేతగా నిలిచిన వారికి 100 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఆగస్ట్ 31 వరకే ఈ ఆఫర్లన్నీ అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే ఆఫర్లు ప్రాంతం, షోరూమ్ ప్రాతిపదికన మారొచ్చునని నిపుణులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: