నేటి రోజుల్లో ఎక్కడ చూసినా అందరిలో కరోనా వైరస్ భయమే కనిపిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా  వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వైరస్ ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. అయితే ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి పిల్లలు వృద్ధులకు అతి ప్రమాదకరం అన్న వాదన ఎక్కువగా అందరినీ భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం శరవేగంగా కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఇంట్లో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా... కుటుంబ సభ్యులందరి లో ఆందోళన నెలకొంది. చిన్నపిల్లలు గొంతునొప్పి జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే చాలు తల్లిదండ్రులు వణికిపోతున్నారు.



 అయితే పిల్లల్లో దగ్గు జ్వరం గొంతు నొప్పి లాంటి సమస్యలపై తాజాగా వైద్యులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గొంతు నొప్పి జ్వరం ఉన్నంత మాత్రాన భయపడాల్సిన పని లేదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలతో పాటు  వాతావరణం కూడా ఎంతో చల్లగా ఉంటుందని... ఈ కాలంలో పెద్దలతో పాటు పిల్లల్లో  కూడా వైరల్ ఫీవర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించిన లక్షణాలు కరోనా  లక్షణాలు కు దగ్గరగా కనిపిస్తాయని... కానీ తల్లిదండ్రులు ఇలాంటి లక్షణాలపై కంగారు పడాల్సిన అవసరం లేదు అంటూ వైద్యులు చెబుతున్నారు.



 కరోనా  వైరస్ లక్షణాలు మాదిరిగానే టాన్సిలైటిస్ వ్యాధి లక్షణాలు కూడా ఉంటాయి అని చెప్పిన వైద్యులు... గొంతునొప్పి జ్వరంతో పాటు మెడ వద్ద వాపు గొంతులో మంట,  గొంతు బొంగురు పోవడం,  నోటి దుర్వాసన లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని తెలిపారు. అంతేకాకుండా చల్లటి వస్తువులు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయని చెప్పారు. అయితే ఇది కూడా ప్రమాదకరమే అంటూ చెబుతున్న వైద్యులు... 10 నుంచి 15 రోజుల వరకూ ఇలా పిల్లల్లో లక్షణాలు కనిపించినప్పుడు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే అది ఏకంగా శస్త్రచికిత్స వరకు దారితీసే ముప్పు ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: