ప్రజల కోసం మీరు తెల్లదొరలను తరిమికొట్టారు. కానీ నల్లదొరలే నయవంచకులై ప్రజలను వంచిస్తున్నారు. ఆంగ్లేయులు అవలంభించే విభజించు పాలించు సూత్రాన్ని మీరు వ్యతిరేకించారు. అయితే నేతలు కులాల వారీగా విభజించి పాలనసాగిస్తున్నారు. అహింసే మార్గమని మీరు చాటి చెప్పారు. అధికారం కోసం హింసామార్గంలో పయనిస్తూ అధికారం చేజిక్కించుకుంటున్నారు. మీరు ఒకచెంపపై కొడితే మరో చెంప చూపించారు. కాగా పాలకులు ధరలు ఆకాశానికి చేర్చి సామాన్యుల రెండు చెంపలు వాయిస్తున్నారు. మీరు దేశం కోసం ఉప్పు సత్యాగ్రహం చేశారు. కానీ మనవాళ్ళు అప్పుకోసం విదేశాల వద్ద పడిగాపులు గాస్తున్నారు. మహాత్మ మీరు విదేశీ వస్తువులను బహిష్కరించమన్నారు. మనవాళ్లు ఎఫ్ డీఐలంటూ విదేశీ వస్తువులకు ఆహ్వానం పలుకుతున్నారు. మన్నించు మహాత్మా గాంధీ కాలం పోయింది. ఇక్కడ గాడ్సేల రాజ్యమే కొనసాగుతోంది...?   గాంధీజీ కన్న కలలు కల్లలు చేశారు. దేశంలో మతసామరస్యం మచ్చుకైనా కనిపించడం లేదు. ఆడది అర్థరాత్రి తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యమని గాంధీజి తేల్చిచెప్పారు. కానీ నేటి పరిస్థితుల్లో పట్టపగలే మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. తెల్లదొరలను తరిమికొట్టడంలో తరిమికొట్టడంలో మీరు శాంతి మార్గాన్ని ఎంచుకుని విజయాలు సాధించారు. కానీ పేరుకు గాంధీజి మార్గం అని చెబుతూ మన వాళ్ళు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు.  రాజకీయాల్లోకి వచ్చే ప్రతి నాయకుడు గాంధీజి ఆశయాల కోసం అని చెబుతున్నారు. కానీ నిజానికి వారి ఆస్తులను మరింత పెంచుకోవాడానికే అని తేటతెల్లమవుతోంది. దేశాన్ని దాస్య శ్రుంకలాలను నుంచి విముక్తి చేయడం కోసం మీరు జైత్రయాత్రం చేశారు. కానీ నేతలు అధికారం కోసం పాదయాత్రలు చేస్తున్నారు. దేశంలో స్కాములు.మహాత్మా మీకు ఇటీవల కాలంలో దేశంలో జరిగిన కుంభకోణాలపై వివరిస్తా వినండి. కల్మాడీ అనే ఓ కీలాడీ రాజకీయ ముసుగులో వేలాది కోట్ల రూపాయలు దిగమింగాడు. అలాగే రాజా అనే ఓ అరవోడు 2జి స్పెక్ట్రాం (టెలీఫోన్)లో దాదాపు 2లక్షల కోట్లు కొల్లగొట్టాడు. కాగా ఈ కేసులో కనిమొళి అనే కిలాడీ కూడా వాటాలున్నాయట. యూరియా ఓటుకు నోటు.గడ్డి.బోఫోర్స్ లాంటి ఎన్నో కుంభకోణాలు జరిగాయి మహాత్మా. అంతేకాకుండా మన రాష్ట్రంలోనూ కొందరు అవినీతి గడ్డి కరిచి కటకటల్లో ఉన్నారు. మీలా వీళ్ళు దేశం కోసం కటకటాలకు వెళ్లలేదు మహాత్మా కేవలంస్వలాభం కోసం అడ్డదారులు తొక్కి అరదండాల పాలయ్యారు. వీరి పాలనలో ఉన్న మమ్మల్ని మన్నించు మహాత్మా.....జైల్లో వున్న వారిని పొరపాటున కూడా మన్నించకు.  

మరింత సమాచారం తెలుసుకోండి: