గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం...టీడీపీకి కంచుకోట అనడం కంటే ధూళిపాళ్ళ ఫ్యామిలీ అడ్డా అనడం బెటర్. ఇక్కడ ఆ ఫ్యామిలీకి తిరుగులేదు. ధూళిపాళ్ళ వీరయ్య చౌదరీ టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1983, 1985, 1989 ఎన్నికల్లో ఆయన వరుసగా విజయం సాధించారు. ఇక వీరయ్య తనయుడు నరేంద్ర వరుసపెట్టి టీడీపీ జెండాని నిలబెడుతూనే వచ్చారు.

1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచి సత్తా చాటారు. అయితే డబుల్ హ్యాట్రిక్ కొడదామని చూసిన నరేంద్రకు జగన్ రూపంలో పెద్ద షాక్ వచ్చింది. 2019 ఎన్నికల్లో ధూళిపాళ్ళని వైసీపీ నేత కిలారు రోశయ్య ఓడించారు. స్వల్ప మెజారిటీతోనే ధూళిపాళ్ళ ఓటమి పాలవాల్సి వచ్చింది. అయితే ఓటమి పాలయ్యాక ధూళిపాళ్ళ పార్టీలో యాక్టివ్‌గా లేకుండా పోయారు.

ఊహించని ఓటమితో సైలెంట్ అయిపోయారు. ఇక అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్‌లో తన పేరు రావడంతో ధూళిపాళ్ళ బయటకొచ్చి, వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలు ఖండించారు. అప్పుడు మాత్రం బయటకొచ్చిన ధూళిపాళ్ళ మళ్ళీ కొన్నిరోజులు సైలెంట్ అయ్యి, అప్పుడప్పుడు మీడియా సమావేశాల్లో కనిపించారు. కానీ పార్టీ పరంగా ఫుల్ యాక్టివ్‌గా పనిచేయలేదు.

దీంతో ధూళిపాళ్ళ కూడా పార్టీ మారిపోతారని వార్తలు వచ్చాయి. అయితే టీడీపీకి వీర విధేయులుగా ఉండే ధూళిపాళ్ళ కుటుంబం పార్టీ మారే ప్రసక్తి లేదని ఆయన అనుచరులు ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చారు. ఇక జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ధూళిపాళ్ళ మళ్ళీ లైన్‌లోకి వచ్చేశారు. అమరావతినే రాజధానిగా ఉండాలని చెప్పి తన వాయిస్‌ని బలంగా వినిపిస్తున్నారు.

పైగా అమరావతి పక్కనే ఉండటం వల్ల ధూళిపాళ్ళకు బాగా కలిసొచ్చింది. ఇక్కడ ప్రజలు ఎక్కువ శాతం మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉండటంతో, ధూళిపాళ్ళకు బాగా ప్లస్ అవుతుంది. దీంతో ఆయన మళ్ళీ రూట్ మార్చేసి, ఫుల్ యాక్టివ్‌ అయ్యారు. పొన్నూరులో పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సారి ఎన్నికల్లో మాత్రం అదిరిపోయే విజయం సాధించాలనే దిశగా ముందుకెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: