ఎంతోమందికి కారు కొనుగోలు చేయాలనే  కల ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దీనికోసం కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు డబ్బులు సరిపడక వెనుకడుగు వేస్తుంటారు. కొంతమంది సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.అయితే ఇలా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఒక బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. అదిరిపోయే ఆఫర్లతో కారు కొనాలనుకునే వారికి ఎన్నో ప్రయోజనాలు కలిగనున్నాయి. సెప్టెంబర్ నెలలో కారు కొనుగోలు చేసిన వారికి ఈ ఆఫర్ లు అన్నీ వర్తించునున్నట్లు తెలుస్తోంది. హుండాయ్ ఆఫర్లను తమ కస్టమర్ల కోసం అందిస్తోంది.



 ముఖ్యంగా హుండాయ్  కార్లు కొనుగోలు చేసే వారికి 60వేల వరకు ప్రయోజనాలు కలిగే విధంగా సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. కొన్ని ఎంపిక చేసిన హుండాయ్  కార్ల కు మాత్రమే ఈ ఆఫర్ లు వర్తించనుండడం గమనార్హం. హుండాయ్ నుండి ఆరా, గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ10 నియోస్, ఎలైట్ ఐ20, ఎలంట్రా, శాంట్రో ఇలాంటి కార్ల కు మాత్రమే ఈ ఆఫర్ లు అందుబాటులో ఉన్నాయి. ఆరా కారుపై రూ.20,000 వరకు,  గ్రాండ్ ఐ10 నియోస్ కారుపై రూ.25,000 వరకు, హ్యుందాయ్ ఎలంట్రా కారుపై  రూ.60,000 , శాంట్రో కారుపై రూ.45 వేలు, ఎలైట్ ఐ20 కారుపై రూ.60 వేల వరకు, గ్రాండ్ ఐ10పై కూడా రూ.60 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు.




 ఇంతేకాకుండా క్యాష్ డిస్కౌంట్,  కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి కూడా ఈ తగ్గింపు ప్రయోజనాలను కలిగి ఉంటాయి అని  సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉంటే సీఏలు,  టీచర్లు, డాక్టర్లు,  పలు కార్పొరేట్ ఉద్యోగులు,  మెడికల్ సిబ్బందికి మరిన్ని ప్రత్యేకమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది  హుండాయ్  సంస్థ. ఇక ఒకవేళ కారు కొనాలనుకునే సరైన డబ్బులు లేక వెనకడుగు వేసే వారికి కూడా కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లను అందుబాటులో ఉంచింది . ఎంతో అద్భుతమైన ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్ వారికోసం అందుబాటులో ఉంచింది... లోన్ తీసుకొని కారు కొనుగోలు చేస్తే మూడు నెలలు తక్కువ ఈఎంఐ ప్రయోజనం కూడా పొందవచ్చు అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: