బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇళ్లలో నివసిస్తున్న ముగ్గురు మహిళలతో పాటు ఇద్దరు చిన్నారులు రాకెట్ దాడిలో దుర్మరణం చెందారని ఇరాన్ మిలటరీ అధికారులు ప్రకటించారు. ఈ ఐదుగురు దుర్మరణం చెందడంతో ఇరాన్ దేశంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంతేకాదు ఇరాక్ రాజధానికి నైరుతి దిశలో అల్బు-అమీర్ ప్రాంతంలో కాటియుషా రాకెట్ దాడిలో మరో ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని ఇరాకీ జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ మీడియా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.


బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి దగ్గరలో ఉన్న అల్-జిహాద్ పరిసరాల నుండి కొందరు నేరగాళ్లు సమూహాలుగా ఏర్పడి రాకెట్ల దాడికి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు.
ఇరాక్ దళాల కమాండర్-ఇన్-చీఫ్ తో పాటు ఆ దేశ ప్రధాన మంత్రి ముస్తఫా క్రిమినల్ గ్యాంగుల దాడులను తీవ్రంగా ఖండించారు. అలాగే అల్-ఖాదిమి గ్రూపులు సంచరించే అల్-జిహాద్ పొరుగు ప్రాంతాల భద్రతకు బాధ్యత వహించే అధికారులను అరెస్టు చేయాలని, ఈ సంఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశించారు.


అయితే ఇప్పటివరకూ ఏ క్రిమినల్ గ్రూపు కూడా రాకెట్ దాడిని చేసినట్లు ప్రకటించలేదు. కానీ బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు తో పాటు ఇరాక్ లో సైనిక స్థావరాలు లో ఉన్న యుఎస్ దళాలను, గ్రీన్ జోన్లోని యుఎస్ రాయబార కార్యాలయాన్ని రాకెట్ల దాడిలో ధ్వంసం చేస్తున్నారు క్రిమినల్ గ్యాంగులు.


ఇరాక్ మీడియా నివేదికల ప్రకారం, ఇరాక్ ప్రభుత్వం రాకెట్ దాడులు వంటివి వెంటనే ఆపేందుకు ఎటువంటి ఎటువంటి చర్యలు తీసుకోకపోతే బాగ్దాద్‌లోని తన రాయబార కార్యాలయాన్ని అమెరికా ప్రభుత్వం మూసివేస్తుందని తమ 3000 సైనిక దళాలను అక్కడి నుండి ఖాళీ చేయిస్తుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ గతంలో ఇరాక్‌ను హెచ్చరించారు. అమెరికా సైనిక దళాల స్థావరాలపై రోడ్డు సైడ్ బాంబులు కూడా వేయడానికి వెనుకాడడం లేదు అల్-ఖాదిమి గ్రూపులు.

మరింత సమాచారం తెలుసుకోండి: