ఏపీలో టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు, ఇటీవల పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలకు 25 అధ్యక్షులని పెట్టారు. ఇక అందులో కమ్మ సామాజికవర్గ ప్రభావం కాస్త ఎక్కువగా ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాలో, ఆ వర్గ నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. గుంటూరు జిల్లాలో మూడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి.

అందులో ప్రకాశం జిల్లాకు చెందిన అసెంబ్లీ స్థానాలు నాలుగు, గుంటూరులో మూడు అసెంబ్లీ స్థానాలు కలిసి ఉన్న బాపట్లకు యువ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుని పెట్టారు. యువ నాయకుడుగా మంచి ఫాలోయింగ్‌ ఉన్న ఏలూరి బాపట్లలో దూసుకెళుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ స్థానాల వారీగా నేతలనీ కలుస్తూ, పార్టీని బలోపేతం చేసే దిశగా నడుస్తున్నారు. ఇటు నరసారావుపేట పార్లమెంటరీ అధ్యక్షుడుగా జి‌వి ఆంజనేయులుని నియమించారు.

జి‌వికి కూడా పార్లమెంట్‌పై మంచి పట్టుంది. ఈయన కూడా పార్లమెంట్‌లో పార్టీని యాక్టివ్ చేస్తున్నారు. ఇక గుంటూరు పార్లమెంట్ స్థానంలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తెనాలి శ్రావణ్ కుమార్‌కు అవకాశం ఇచ్చారు. ఇటు కృష్ణాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉంటే మచిలీపట్నంకు బీసీ నేత కొనకళ్ళ నారాయణని అధ్యక్షుడుగా పెట్టారు. ఇక కీలకమైన విజయవాడ స్థానానికి కమ్మ నేత నెట్టెం రఘురాంని నియమించారు. సీనియర్ నేతగా ఉన్న రఘురాంకు విజయవాడపై మంచి పట్టుంది. నేతలు కూడా రఘురాంకు మంచి సహకారం అందిస్తున్నారు.

ఇక కృష్ణాలో రెండు అసెంబ్లీ స్థానాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలు కలిసి ఉన్న ఏలూరు పార్లమెంట్‌కు కమ్మ నేత గన్నీ వీరాంజనేయులుని అధ్యక్షుడుగా పెట్టారు. గన్నీకు పార్లమెంట్ పరిధిలో మంచి పేరుంది. 2014 ఎన్నికల్లో ఉంగుటూరు ఎమ్మెల్యేగా గెలిచిన గన్నీ, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయినా సరే గన్నీ దూకుడుగా పని చేస్తున్నారు. మొత్తానికైతే అధ్యక్షులుగా ఉన్న ఏలూరి సాంబశివరావు, జి‌వి ఆంజనేయులు, నెట్టెం రఘురాం, గన్నీ వీరాంజనేయులు టీడీపీని గట్టెక్కిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: