ఆంధ్రప్రదేశ్ లో రోజుకొక వింత సంఘటనలు బయట పడుతున్నాయి .. వజ్రాలు దొరకడం ,విగ్రహాలు బయటపడటం , ప్రతిదీ ఎప్పుడు లేని విదంగా జరుగుతున్నాయి .. మరి ఇప్పుడు ఏమి  బయట పడిందని మీ సందేహమా ..ఇది వినటానికి ఆశ్చర్యం వేయదు కానీ భయం వేస్తుంది ...నేను చెప్పింది వింటే అమ్మా బాబోయి అంటారు .
మీరు ఎప్పుడైనా చేపల వేటకి వెళ్ళారా .. సరదాకైనా  అప్పుడపుడు వెళ్లే ఉంటారు.. మరి మీకు చేపలు దొరకకుండా ఇంకా ఏమైనా మీ వలకి చిక్కిందా ?? చేపల వేటకి వెళ్తే  వచ్చేటపుడు బుట్ట నిండా చేపలతో తిరిగి వస్తారు.. కానీ కృష్ణ జిల్లాలో చేపల వేటకి వెళ్తే ఏమి జరిగిందో చూడండి ...  

గత కొన్ని రోజులుగా కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి .. ఈ కురిసిన వర్షాలకు పాములు,మరియు  చేపలు వరద నీటి గుండా  పొలాల వైపు కొట్టుకొని వస్తున్నాయి. అలాగే ఉంగుటూరు మండలంలోని తరిగోపులలో వరద నీటి గుండా ఒక  కొండ చిలువ వచ్చింది. అదే గ్రామం లోని పొగిరి శివ అనే వ్యక్తి వృత్తి రీత్యా వ్యవసాయ కూలి.. అతడు స్థానిక రైల్వే గేట్ దగ్గర కాలువ లో  చేపలు పట్టడానికి వెళ్లాడు. కాలువలో దిగగా కాలు వ అంచుల వెంబడి శివ కి  చేప లాంటి ఒక ఆకారం కనపడింది.. శివ దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా ఆ తర్వాత ఏమీ జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు .. శివ చేప అనుకోని పట్టుకోబోతుండగా అక్కడ చూస్తే అది చేప కాదు  భారీ కొండచిలువ . ఆ కొండ చిలువను చూసి అవాక్కైనా శివ.. వెంటనే దానిని ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు. .. ఆ తర్వాత దానిని దగ్గరి చెరువులో వదిలేశాడు.

ఒక కృష్ణా జిల్లా మాత్రమే కాదు.. గుంటూరు జిల్లాలో కూడా ఇటీవల కొండ చిలువ బయటపడింది. అది కూడా  వరద నీటి గుండా వచ్చినట్లు తెలుస్తుంది .. ఆ కొండ చిలువ . పొలాల పక్కన తిరుగుతూ ఉండడంతో అది చూసిన రైతులు, స్థానికులు భయభ్రాంతులకు గురై అక్కడి నుండి పరుగులు తీశారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేశారు. అటవీశాఖ అధికారులు ఆ కొండ చిలువను తీసుకుపోవడంతో  స్థానికులందరు  ఊపిరి పీల్చుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: