ఏపీలో ప్రతిపక్ష టీడీపీ దూకుడు కనబరుస్తోంది. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీ పరిస్తితి మరి దారుణంగా తయారైన విషయం తెలిసిందే. చాలామంది నాయకులు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళిపోయారు. అలాగే మరికొందరు అధికార వైసీపీ తాకిడి తట్టుకోలేక బయటకు రాలేదు. ఏదో చంద్రబాబుతో పాటు మరికొందరు నేతలు మాత్రమే జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వచ్చారు.

అయితే ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చంద్రబాబు పార్టీలో పదవుల పంపకం చేపట్టారు. పార్టీలో కీలకమైన పదవులని భర్తీ చేశారు. ముఖ్యంగా టీడీపీలో ఎప్పుడు లేని విధంగా పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించారు. దీంతో కొత్త అధ్యక్షులు దూకుడుగా కనబరుస్తున్నారు. నియోజకవర్గాల్లో కేడర్‌ని బలోపేతం చేస్తూ, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఇద్దరు నేతలు మాత్రం సైకిల్ స్పీడ్ పెంచే పని మొదలుపెట్టారు.

ఏలూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు గన్నీ వీరాంజనేయులు, బాపట్ల టీడీపీ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావులు బాగా దూకుడుగా పనిచేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గన్నీ, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా సేరే గన్నీ తన నియోజకవర్గంలోనే పార్టీని మళ్ళీ బలోపేతం చేసే కార్యక్రమం మొదలుపెట్టి, నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ముందుకెళ్లారు. ఇదే క్రమంలో చంద్రబాబు, గన్నీకి ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడుగా పదవి ఇచ్చారు.

దీంతో తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
అటు పర్చూరు నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఏలూరి సాంబశివరావుకు బాపట్ల పగ్గాలు ఇచ్చారు. బాపట్ల పగ్గాలు తీసుకున్నాక ఏలూరి వైసీపీకి ధీటుగా టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఏలూరికి మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది. మొత్తానికైతే ఈ ఇద్దరు నేతలు సైకిల్ స్పీడ్ పెంచే పనిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: