ప్రస్తుతం సమాజంలో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. అయితే కరెంట్ ను ఆదా చేసేందుకు ముందుగా చేయవలిసిన పని ఏమిటంటే బాగా పాత‌వైపోయిన ఎల‌క్ట్రిక్ వ‌స్తువుల‌ను వాడ‌కుండా పక్కన పెట్టేయండి. సీలింగ్ ఫ్యాన్‌ను  8 ఏళ్ల‌కు మించి వాడితేకరెంటును ఎక్కువ‌గా తీసుకుంటుందట. కాబ‌ట్టి బాగా పాతవైన ఎల‌క్ట్రిక‌ల్ వ‌స్తువుల‌ను పక్కన పెట్టడం మంచిది. ఎల్ఈడీ లైట్ల‌ను అమ‌ర్చ‌డం వ‌ల్ల విద్యుత్‌ను బాగా పొదుపు చేయ‌వ‌చ్చు.

అయితే పెద్ద‌గా ఉన్న గ‌దుల‌కైతే 14 వాట్ల బ‌ల్బు చాలు. అదే కొంచెం చిన్న‌గా లేదంటే సాధార‌ణ సైజ్‌లో ఉన్న గదులకైతే 9, 10 వాట్ల ఎల్ఈడీ బ‌ల్బులు స‌రిపోతాయి. అదే పూజ‌గ‌ది, బాత్‌రూం, లాంటి వాటికైతే 1, 2 వాట్ల ఎల్ఈడీ బ‌ల్బులు సరిపోతాయి. ఏసీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్‌లు, ఐర‌న్ బాక్సులు ప‌వ‌ర్ స్టార్ రేటింగ్స్ ‌తో ల‌భ్య‌మ‌వుతున్నాయి. వాటిలో 5 రేటింగ్ ఉన్న వ‌స్తువుల‌ను కొనుగోలు చేసి వాడితే విద్యుత్‌ను చాలా త‌క్కువ‌గా వినియోగించబడుతుంది. ఇన్వ‌ర్ట‌ర్ టెక్నాల‌జీ ఉన్న ఏసీలు అయితే  విద్యుత్‌ను చాలా త‌క్కువ‌గా అవుతుంది.

ఇక సీలింగ్ ఫ్యాన్లు లోక‌ల్ బ్రాండ్ కాకుండా బ్రాండెడ్ సీలింగ్ ఫ్యాన్లు అమర్చుకుంటే విద్యుత్ వాడకం బాగా తక్కువగా ఉంటుంది. దీని వెనుక కారణం లోక‌ల్ ఫ్యాన్లు 75, 90, 100 వాట్ల సామ‌ర్థ్యం ఉపయోగించుకుంటాయి. అదే బ్రాండెడ్ ఫ్యాన్లు అయితే 40, 50 వాట్ల ప‌వ‌ర్‌ను మాత్ర‌మే వినియోగించుకుంటాయి. రిమోట్‌తో ఆన్ చేసుకునే ఏసీలు, టీవీలు, హోమ్ థియేట‌ర్ల వంటి వాటిని రిమోట్‌తో ఆఫ్ చేస్తారు. కానీ స్విచ్ ఆఫ్ చేయ‌రు. వీటి వలన కూడా కొంత కరెంట్ వృథా అవుతుంటుంది.

అంతేకాదు వాషింగ్ మెషీన్లు, డిష్ వాష‌ర్లు, ఉన్న‌వారు త‌క్కువ మొత్తంలో గిన్నెలు లేదా బ‌ట్ట‌లు ఉన్నా వాటిని మెషిన్ల‌లో వేసి ఉత‌కడం, తోమడం చేస్తుంటారు. మెషిన్ల సామ‌ర్థ్యానికి త‌గిన‌ట్టుగా పూర్తి స్థాయిలో లోడ్ లేక‌పోతే విద్యుత్ వినియోగం ఎక్కువ‌వుతుంది. కాబ‌ట్టి త‌క్కువ త‌క్కువ మోతాదులో గిన్నెలు, బ‌ట్ట‌లు ఉంటే మెషిన్ల‌లో వేయ‌క‌పోవ‌డ‌మే మంచిది. దీంతో క‌రెంట్ వృథాకాకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: