ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు రోగ నిరోధక శక్తి చాలా అవసరం. ఎందుకంటే ఒక వైపు కరోనా మరో వైపు శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు ఇవన్నిటిని అధిగమించాలంటే మనకు మంచి శక్తి కావాలి.. మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఈ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే కొన్ని రకాల పదార్థాలు, అలాగే కొన్ని రకాల పానీయాలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గుతుందట అవేంటో ఇప్పుడు చూద్దాం..


మద్యాన్ని అధికంగా సేవించడం..

రోజూ మద్యం సేవించేవారిలో కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశంతోపాటు రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు.మద్యం ఎక్కువగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.. దాని వల్ల  మొదట న్యూమోనియా రావడం, అనంతరం శ్వాస తీసుకోవడంలోనూ సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో కరోనా సోకితే దాని తీవ్రత అధికంగా ఉంటుంది. అందుకే మద్యం సేవించడం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు తీసుకోక పోవడమే మంచిది అని అంటున్నారు.



కాఫీ, టీ ఎక్కువగా తాగడం..


రోజులో ఒక కప్పు లేదా రెండు కప్పులు మాత్రమే టీ , కాఫీ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. అలా కాదని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు.


అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం..

యువత, పిల్లలు ఎక్కువగా జంక్‌ఫుడ్‌ తింటుంటారు. వారాంతం వస్తే చాలు, ఇంటి వంట పక్కన పెట్టి.. పిజ్జా, బర్గర్లు కావాలంటూ మారం చేస్తారు. తల్లి దండ్రులు కాదనలేక కొనిస్తుంటారు. కానీ, ఈ జంక్‌ఫుడ్‌ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వీటి వల్ల శరీరంలో కొవ్వు పెరిగి, రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. దీంతో సులువుగా వ్యాధులు శరీరంలోకి వచ్చి చేరుతాయి.


వీటితో పాటుగా చక్కెర, ఉప్పు వంటి వాటిని తీసుకోకూడదు.. ఒత్తిడికి గురి కావడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది.. అయితే పెంచుకోవాలంటే .. మంచి ఆహారాన్ని తీసుకోవడం.. పండ్లు, కూరగాయలు ఫ్రెష్ గా తీసుకోవాలి.వ్యాయామం, యోగా వంటివి మానసిక ఒత్తడిని తగ్గిస్తాయి. రోగనిరోధకశక్తిని పెంచుతాయి.తరచూ నీరు తాగాలి.ఆకు కూరల్లో విటమిన్‌ ఏ, సీ, కే ఉంటాయి. మెగ్నిషియం, కాల్షియం వంటి పోషకాలుంటాయి... ఇలా చేస్తే మన ఆయుష్ పెరుగుతుంది.. లేకుంటే మీ ప్రాణాలను మీరే తీసుకున్న వారు అవుతారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: