కరోనా  వైరస్ కారణం గా నిలిచిపోయిన ఆర్టీసీ సర్వీసులు ప్రస్తుతం ప్రారంభం అయ్యాయి అనే విషయం తెలిసిందే  ప్రయాణికుల రద్దీకి అనుగుణం గా పూర్తిస్థాయి లో ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించేందుకు అటు ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రయాణికుల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సదుపాయాల ను కల్పిస్తుంది ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఇటీవలే మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.


 ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది.  ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్  సోర్సింగ్ ఉద్యోగులకు ఇకనుంచి ఫ్రీ బస్ పాస్ జారీ  చేసేందుకు నిర్ణయించింది ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ. ఈ విషయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ ఎండి కృష్ణ బాబు స్పష్టం చేశారు. అయితే కొత్త సంవత్సరం నుంచి ఈసరికొత్త నిర్ణయం అమలులోకి వస్తుంది అంటూ ఆయన స్పష్టం చేశారు.



 జనవరి 1 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉచితంగా బస్ పాస్ పొందేందుకు అవకాశం ఉంటుంది అంటూ ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబు స్పష్టం చేశారు. ఉద్యోగి ఇంటి నుంచి బస్ డిపో వరకు కూడా ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం ఉంటుందని దాదాపు 25 కిలోమీటర్ల పరిధి వరకు బస్సు పాస్  వర్తిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. అన్ని డిపో మేనేజర్లు యూనిట్ లలో కూడా ఈ ఫ్రీ బస్సు పాసులు జారీ చేసేలా చర్యలు చేపడతామని ఆయన చెప్పుకొచ్చారు. వీటిని దుర్వినియోగం చేయవద్దని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: