ప్రస్తుతం ఎంతో మందికి కారు కొనుగోలు చేయాలనే కలలను సాకారం చేసేందుకు వివిధ కార్ల తయారీ కంపెనీ లు  అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచుతూ  ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా కొనుగోలు కార్  చేయాలనుకొనే వారికి అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉన్నది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హుండాయ్ తమ కార్ల పై అదిరిపోయే ఆఫర్లు అందిస్తూ తమ సేల్స్ పెంచుకోవడంతో పాటు ఎంతో మందికి కార్ల కొనుగోలుకు ఎంతో ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది.  ఇక కొన్ని ఎంపిక చేసిన కార్లను కొనుగోలు చేయడం ద్వారా భారీగా డిస్కౌంట్లు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.



 అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది అన్నది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హ్యుందాయ్ కంపెనీ శాంట్రో, గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, ఎలెంట్రా వంటి మోడళ్లపై అదిరిపోయే తగ్గింపు అందిస్తోంది. ఇక ఆయా మోడల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ డిలైట్ ఆఫర్ కింద తగ్గింపు అందిస్తోంది ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్. ప్రభుత్వ ఉద్యోగులు ఎల్‌టీసీ బెనిఫిట్ కూడా లభిస్తుంది. రూ.8 వేల వరకు ప్రయోజనం పొందొచ్చు..


హ్యుందాయ్ శాంట్రో కారు ధర రూ.4.63 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. గరిష్ట ధర రూ.6.31 లక్షలు. ఈ మోడల్‌ కారుపై రూ.50 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. అంతేకాకుండా మూడేళ్ల ఆన్‌రోడ్ వారంటీ లభిస్తోంది. అదే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారుపై రూ.60 వేల వరకు తగ్గింపు ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారుపై కూడా రూ.60,000 వరకు తగ్గింపు లభిస్తోంది. హ్యుందాయ్ ఆరా కారుపై ఏకంగా రూ.70 వేల వరకు డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. హ్యుందాయ్ ఎలంట్రా కారుపై గరిష్టంగా రూ.లక్ష వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఇకపోతే కార్ల కంపెనీలు జనవరి నుంచి కార్ల ధరలు పెంచుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: