కేసీఆర్ తెలంగాణ సీఎం అయ్యాక తెలంగాణ ప‌ల్లెల స్వ‌రూపాన్ని పూర్తిగా మార్చేశారు. ఇష్ట‌మొచ్చిన‌ట్టు జిల్లాల‌ను పెంచేసిన కేసీఆర్‌.. ఇక మండ‌ల స్థాయికి ఎక్కువుగా ఉన్న చిన్న ప‌ల్లెటూరును కూడా మున్సిపాల్టీగా చేసేశారు. చిన్న ప‌ల్లెటూరును కూడా మండ‌ల కేంద్రంగా మార్చేశారు. కేవ‌లం రెండు ఎంపీ టీసీల‌తో మండ‌లాలు ఏర్పాటు చేసిన ఘ‌న‌త కూడా కేసీఆర్‌దే. ఇక ఇప్పుడు ఏపీలోనూ ప‌ట్ట‌ణీక‌ర‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలో కొత్త ప‌ట్ట‌ణాలు ఏర్పాట‌వుతున్నాయి.

కొత్త మున్సిపాల్టీలు, న‌గ‌ర పంచాయితీల లిస్ట్ ఇదే...

వైఎస్సార్ తాడిగడప: కానూరు, పోరంకి, తాడిగడప, యనమలకుదురు గ్రామాల‌తో ఏర్పాటు కానుంది. కృష్ణా జిల్లాలోని పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఉంది.

మంగళగిరి మున్సిపాలిటీ: నవులూరు, చిన కాకాని, కాజా, నూతక్కి, ఎర్రబాలెం, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి, రామచంద్రాపురం, ఆత్మకూరు గ్రామాలు మంగ‌ళ‌గిరి మున్సిపాల్టీలో విలీనం కానున్నాయి.

తాడేపల్లి మున్సిపాలిటీ: ఉండవల్లి, వడ్డేశ్వరం, కుంచంపల్లి, పెనుమాక, కొనలుకొండ, పాతూరు గ్రామాలు తాడేప‌ల్లి మున్సిపాల్టీలో విలీనం కానున్నాయి.

పాలకొల్లు మున్సిపాల్టీ చుట్టూ ఉన్న ఐదు గ్రామాలు మున్సిపాల్టీలో విలీనం కానున్నాయి. అలాగే తాడేప‌ల్లిగూడెం ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉన్న ఐదు గ్రామాలు, పొన్నూరు మున్సిపాల్టీ చుట్టూ ఉన్న మ‌రో ఐదు గ్రామాలు, త‌ణుకు ప‌ట్ట‌ణాన్ని ఆనుకున్ని ఉన్న నాలుగు గ్రామాలు, భీమ‌వ‌రం ప‌ట్ట‌ణాన్ని ఆనుకుని ఉన్న నాలుగు గ్రామాలు, బాప‌ట్ల చుట్టూ ఉన్న ఎనిమిది గ్రామాలు.. ప్ర‌కాశం జిల్లా కందుకూరు ప‌ట్ట‌ణాన్ని ఆనుకుని ఉన్న 10 గ్రామాలు ఆయా మున్సిపాల్టీల్లో విలీనం కానున్నాయి.

ఇక వీటితో పాటు కొత్త‌గా కొన్ని న‌గ‌ర పంచాయతీల‌ను ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇందులో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన చింత‌ల‌పూడి, చిత్తూరు జిల్లాలోని బి.కొత్తకోట, విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన రాజాం, క‌ర్నూలు జిల్లాలోని అల్లూరు, ప్ర‌కాశం జిల్లాలోని మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని పొదిలి గ్రామాలను నగర పంచాయతీలుగా మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. వీటితో పాటు మ‌రికొన్ని కొత్త న‌గ‌ర పంచాయతీల ఏర్పాటుపై క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: