రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రైతుల అభివృద్ది కోసం భారత ప్రధాని మంత్రి నరేంద్ర కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే రైతుల కోసం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రైతులకు లబ్ది పొందేందుకు అన్నీ వెసులుబాటును కూడా అందించారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి సాయం పెంచనున్నది. గతంలో ఇచ్చిన నగదు కన్నా కూడా ఇప్పుడు రెట్టింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. కరోనా ప్రభావం వల్ల ప్రజలు చాలా నష్టాలను చూసారు. ఎటువంటి ఆదాయం లేకపోవడంతో తినడానికి కూడా తిండి లేక ఆకలి తో అలమటించారు .. రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి కేంద్ర,రాష్ట్ర   ప్రభుత్వాలు కొత్త ఆలోచన చేసింది. రైతు భరోసా, రైతు బంధు పథకాలను అమలు చేశారు.




ఇందులో భాగంగా 3000 నగదును రైతులకు అందించారు. అంతేకాకుండా కిసాన్ కార్డులను కూడా అందజేశారు. వాటి ద్వారా గేదెలను, వ్యవసాయానికి సంబంధించిన వస్తువులను కూడా కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేశారు.వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద చేసే సాయాన్ని రూ.6000 నుంచి పెంచనున్నట్లు సమాచారం. బడ్జెట్‌ పార్లమెంట్‌ సమావేశాలు ఈ నెల 29వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగించడంతో ప్రారంభం కానున్నాయి.



మరో విషయమేంటంటే.. ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ప్రతిపాదనలను పార్లమెంట్‌కు సమర్పిస్తారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం పీఎం-కిసాన్‌ పథకం కింద రైతులకు అందించే నగదు సాయం పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేయనున్నదని సమాచారం.ప్రస్తుతం అందచేస్తున్న రూ.6000 నగదును మూడు విడుతలుగా ప్రతి నాలుగు నెలలకోసారి అందజేస్తున్నది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతున్నది... ఈ పథకం వల్ల రైతులు సంతోషంగా ఉంటారని కేంద్రం అభిప్రాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: