ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా న్న రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో, వారికి ఆర్థిక చేయూత అందించడం కోసం మోదీ సర్కార్ ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేలు లభిస్తాయి. అయితే ఈ రూ.6,000 ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమవుతాయి. అంటే 4 నెలలకు ఒకసారి పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.2,000 రైతులకు అందుతాయి. ఇప్పటి వరకు 7 విడతల డబ్బు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యింది. అయితే కొంత మందికి మాత్రం పీఎం కిసాన్ డబ్బులు ఇంకా రాలేదు. చిన్న పొరపాటు వల్ల ఈ డబ్బులు నిలిచిపోయి ఉంటాయి. ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ వివరాలు తప్పుగా ఇవ్వడం వల్ల డబ్బులు రాకుండా నిలిచిపోయి ఉండొచ్చు.




మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి మీ వివరాలను కరెక్ట్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆధార్ ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్‌లో తప్పులు ఉంటే మీ అకౌంటెంట్‌ను సంప్రదించండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీ బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్‌ను వెరిఫై చేస్తేనే మీకు పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి. లేదంటే రావు. రాష్ట్ర ప్రభుత్వం వెరిఫై చేసిన తర్వాత ఎఫ్‌టీఓ జనరేట్ అవుతుంది. తర్వాత మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: