జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిహెచ్ఎంసిలో శాశ్వత ఉద్యోగులకు 3142 మందికి గ్రూప్ మెడిక్లేన్ పాలసీ వర్తింపచేయాలని...  49 మంది అర్హులైన సీనియర్ అసిస్టెంట్ లకు సూపరింటెండెంట్ లుగా పదోన్నతి కల్పించాలీ అని నిర్ణయం తీసుకున్నారు. పలు జంక్షన్లు, సెంట్రల్ మీడియంలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటి కింద అభివృద్ది చేయాలని  నిర్ణయించారు. ఈ స్టాండింగ్ కమిటీ స‌మావేశంలో క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌, స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు గంధం జోత్న్స, ముద్రబోయిన శ్రీనివాసరావు, మీర్ బాసిత్ అలీ, సామ స్వ‌ప్న‌, మిర్జా ముస్తఫా బేగ్, సున్నం రాజ్‌మోహ‌న్‌, మహ్మద్ నజీరుద్దీన్ సహా పలువురు పాల్గొన్నారు.

ఒక్కసారి ఆమోదించిన తీర్మానాలు చూస్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో జిహెచ్ఎంసి పార్కు నిర్వహణను సైబర్ సిటీ బిల్డర్స్ కు సీ.ఎస్.ఆర్ కింద చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట శ్మశానవాటికను ఆధునీకరించే పనులను సీ.ఎస్.ఆర్ లో భాగంగా మేసర్స్ ఫోనిక్స్ గ్రూప్ కు అనుమతించారు. మైండ్ స్పేస్ జంక్షన్ నుండి రోలింగ్ హిల్స్ గచ్చిబౌలి వరకు సెంట్రల్ మీడియం నిర్వహణను సీ.ఎస్.ఆర్ కింద ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజి కి అప్పగించాలని నిర్ణయించారు.

పంజాగుట్ట శ్మశానవాటిక ఆధునీకరణకు స్థలాన్ని సీ.ఎస్.ఆర్ కింద ఫొనిక్స్ సంస్థకు అప్పగించే తీర్మానం ఆమోదం పొందింది. ఐకియా ఫ్లైఓవర్ వద్ద సెంట్రల్ మీడియం, ట్రాఫిక్ ఐలాండ్ నిర్వహణ బాద్యతలను సీ.ఎస్.ఆర్ కింద మేసర్స్ ఎస్.పి గ్లోబల్ కు అప్పగించే తీర్మానం ఆమోదం పొందింది. కొత్తగూడ జంక్షన్ నుండి ఆల్వీన్ క్రాస్ రోడ్స్ వరకు సెంట్రల్ మీడియం, ట్రాఫిక్ ఐలాండ్ నిర్వహణ బాద్యతలను సీ.ఎస్.ఆర్ కింద కిమ్స్ ఆసుపత్రి ఎంటర్ ప్రైజెస్ కు అప్పగించేందుకు ఆమోహించారు. నానక్ రాంగూడ ఎంటర్ కాంటినెంటల్ టవర్ రోడ్ షౌల్డర్ల గ్రీనరి నిర్వహణను ఇంటర్ కాంటినెంటల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ కు అప్పగించే తీర్మానానికి ఆమోదం తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 లోని జిహెచ్ఎంసి పార్కు అభివృద్ది, నిర్వహణను సీ.ఎస్.ఆర్ కింద మేసర్స్ సైబర్ సిటీ బిల్డర్స్, డెవలపర్స్ కు అనుమతించే తీర్మానాన్ని కమిటీ సభ్యులు ఆమోదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: