కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని లేవనెత్తుతామ్ అని ఆయన స్పష్టం చేసారు. బండి సంజయ్ మాటలు కూడా ప్రస్తావిస్తాం అని ఆయన పేర్కొన్నారు. టిఆర్ఎస్ అవినీతి పై ఇప్పటివరకు లిఖిత పూర్వక ఫిర్యాదు ఎందుకు చేయలేదు అని ఆయన నిలదీశారు. స్వతంత్ర భారతదేశంలో ఎవరూ చేయని అవినీతి కేసీఆర్ చేశారు అని ఆయన అన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల అవినీతి పై సీబీఐ విచారణ జరిపించాలని పార్లమెంట్ లో డిమాండ్ చేస్తాం అని ఆయన స్పష్టం చేసారు.

బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కేసీఆర్ అవినీతి పై చర్యలు ఎందుకు తీసుకోలేదో అడుగుతాం అని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ముందు కేసీఆర్ ఎందుకు తీసుకోలేదు అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలని కోరుతాం అని అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తాం అని స్పష్టం చేసారు. ఐటీఐఆర్ మీద నిలదీస్తాం అని పేర్కొన్నారు. భువనగిరి లో ఎయిమ్స్ పై ఎందుకు జాప్యం జరుగుతుందో అడుగుతాం అని పేర్కొన్నారు.

డిపిఆర్ లు సమర్పించకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా నిధులు ఇచ్చారో ప్రశ్నిస్తాము అని స్పష్టం చేసారు. మైనారిటీ,ట్రైబల్ రిజర్వేషన్ల ను కేసీఆర్ ఎందుకు సాధించడం లేదు అని నిలదీశారు. కేసీఆర్ ఆ రెండు వర్గాలకు క్షమాపణ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టుల పై పార్లమెంట్ లో అడుగుతాం అని అన్నారు. మెట్రో సంగారెడ్డి వరకు పొడిగించాలని అడుగుతాం అని ఆయన పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్ లో కల్వకుంట్ల కుటుంబం ప్రమేయంతో పెద్ద కుంభకోణం జరిగింది అని ఆయన ఆరోపించారు. సమ్మక్క, సరక్క జాతరను జాతీయ పండగ గా ప్రకటించాలి అని ఆయన డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: