ఇటీవలే తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్  రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారి పోయాయి  అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ను తప్పు పడుతూ అటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ అటు అధికార పార్టీ తీరు పై విరుచుకు పడుతుంది. తెలంగాణ రాజకీయా ల్లో కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా  పేరు ఉన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి అధికార పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.



 నెహ్రూపై సిబిఐ విచారణ వేస్తాము అంటూ వ్యాఖ్యానించడం.. అంతే కాకుండా ఇక తెలంగాణ కాంగ్రెస్లో కీలక నేత  ఉత్తమ్ కుమార్ రెడ్డి పై సంచలన విమర్శలు చేయడం పై ప్రస్తుతం జగ్గా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఉద్యమం సమయం లో తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసింది అని భావిస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం కారణం గానే ఎంతో మంది చరిత్రహీనులు మంత్రులు గా చలామణి అవుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగ్గా రెడ్డి.



 నెహ్రూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ల గురించి మంత్రి జగదీష్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగ్గా రెడ్డి. ఇక జగదీష్ రెడ్డి రాష్ట్ర పవర్ మంత్రి అయినప్పటికీ ఆయనకు అసలు పవరే లేదని.. కేసిఆర్ కు చెంచా గా వ్యవహరిస్తున్నారు అంటూ జగ్గా రెడ్డి విమర్శలు గుప్పించారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం రాక పోయి ఉంటే మంత్రి జగదీష్ కి కేసిఆర్ విస్కీలో సోడా కలిపే  అవకాశం వచ్చేది కాదు అంటూ సెటైర్లు వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: