రాజ‌ధాని ప్రాంతం అయిన అమ‌రావ‌తి విస్త‌రించి ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మెజార్టీ ప్ర‌జ‌లు అయిన కాపు సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌ల ప‌రిస్థితి ముందు నుయ్యి వెన‌క గొయ్యి చందంగా మారింది. ఈ రెండు కీల‌క జిల్లాల్లో కాపుల‌కు పెద్ద ప్ర‌యార్టీ లేదు. నాడు టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా ఈ రెండు జిల్లాల నుంచి కాపు మంత్రి లేరు. ప్ర‌స్తుతం వైసీపీ నుంచి పేర్ని నాని మంత్రిగా ఉన్నా ఆయ‌న వ‌ల్ల కాపుల‌కు ఒరిగిందేమి లేద‌నే అంటున్నారు. ఇక రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ‌తో గ‌త ఐదేళ్లుగా ఓ వెలుగు వెలిగిన కాపులు అంద‌రూ ఇప్పుడు ఆర్థికంగా, వ్యాపార ప‌రంగా కుదేల‌య్యారు.

ఇక అధికార పార్టీలో ఉన్న కాపులు త‌మ వ‌ర‌కు స్వార్థం చూసుకుంటున్నారే త‌ప్పా త‌మ వ‌ర్గం కోసం నోరెత్తితే వాళ్ల‌కు మామూలు వార్నింగ్‌లు రావ‌డం లేద‌ట‌. కృష్ణా జిల్లాలో న‌లుగురు కాపు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కైక‌లూరులో దూలం నాగేశ్వ‌ర‌రావు, అవిన‌గ‌డ్డ‌లో సింహాద్రి ర‌మేష్ - జ‌గ్గ‌య్య‌పేట లో సామినేని ఉద‌య భాను ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరిలో బంద‌రు ఎమ్మెల్యే కం మంత్రి అయిన పేర్ని నాని ప్ర‌తిప‌క్షంపై విమ‌ర్శ‌లు చేయ‌డంతో స‌రి పెడుతున్నారే త‌ప్పా కాపు రిజ‌ర్వేష‌న్లు.. కాపుల ఘోష గురించి ఆయ‌న చిన్న మాట కూడా మాట్లాడ‌లేని ప‌రిస్థితి.

సామినేని సీనియ‌ర్ ఎమ్మెల్యే అయినా ఆయ‌న త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాదా ? అన్న ఆశ‌తో ఏ మాత్రం కాంట్ర‌వ‌ర్సీ లేకుండా చూసుకుంటున్నారు. మిగిలిన ఇద్ద‌రు కాపు ఎమ్మెల్యే గురించి చెప్పుకోవ‌డానికేం లేదు. ఇక గుంటూరు జిల్లాలో అంబ‌టి రాంబాబు ప్ర‌తిప‌క్షంపై విరుచుకు ప‌డిపోతున్నారే త‌ప్పా కాపు వ‌ర్గం రిజ‌ర్వేష‌న్లు.. కాపు ల సంక్షేమం కోసం ఆయ‌న చిన్న ముక్క కూడా మాట్లాడ‌లేని ప‌రిస్థితి. ఇక పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంక‌ట రోశ‌య్య గురించి చెప్పుకోవ‌డానికేం లేదు. పేరుకు మాత్రం ఈ రెండు జిల్లాల్లో ఆరుగురు కాపు ఎమ్మెల్యేలు ఉన్నా వీరిలో ఎవ్వ‌రికి త‌మ జాతి సంక్షేమం, రిజ‌ర్వేష‌న్లు ప‌ట్ట‌వ‌న్న విమ‌ర్శ‌లే ఎక్కువుగా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: