ఆయ‌న బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం ఓట్ల‌తో గెలుపు గుర్రం ఎక్కారు. గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. బ్రాహ్మ‌ణుల ఇంటింటికీ తిరి గారు. వారు చెప్పిన ప్ర‌తి స‌మ‌స్య‌ను సావ‌ధానంగా విన్నారు. `నేనున్నాను.. న‌న్ను గెలిపించండి. నేను మీకు అండ‌గా ఉంటాను . మీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాను. న‌న్నున‌మ్మండి`-అని హామీ ఇచ్చారు. దీంతో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం.. ఆయ‌న‌ను న‌మ్మి.. ఓట్లేసింది. క‌ట్ చేస్తే.. స‌ద‌రు నాయ‌కుడు గెలుపు గుర్రం ఎక్కి రెండేళ్లు పూర్త‌వుతున్నాయి. కానీ, బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లు మాత్రం ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న ఎవ‌రో కాదు.. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పాతిక ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించిన మ‌ల్లాది విష్ణువ‌ర్ధ‌న్‌.

2009లోనూ ఈయ‌న ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించారు. అప్ప‌ట్లోనూ బ్రాహ్మ‌ణుల‌కు అనేక వాగ్దానాలు చేశారు. అయితే.. రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో తాను ఏమీ చేయ‌లేక‌పోయాన‌ని అంగీక‌రించ‌డంతో బ్రాహ్మ‌ణులు అర్ధం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే గ‌త ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కేలా చేశారు. బ‌ల‌మైన టీడీపీ నాయ‌కుడు బొండా ఉమాను కూడా కాద‌ని.. మ‌ల్లాదికి ప‌ట్టం క‌ట్టారు. స‌త్యనారాయ‌న‌పురం, సింగున‌గ‌ర్‌, అయోధ్య‌న‌గ‌ర్, ముత్యాలంపాడు.. త‌దిత‌ర బ‌ల‌మైన బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో మ‌ల్లాదికి మంచి ఓట్లు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు సీఎం జ‌గ‌న్ బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌దవిని కూడా క‌ట్ట‌బెట్టారు.

మ‌రి ఇంత‌గా బ్రాహ్మ‌ణులు ఆయ‌న‌ను ఆద‌రించినా.. బ్రాహ్మ‌ణుల విష‌యంలో మ‌ల్లాది చేసింది ఇప్ప‌టి వ‌ర‌కు ఏమీ క‌నిపించ‌డం లేదు. స‌త్య‌నారాయ‌ణ పురంలో బ్రాహ్మ‌ణుల‌కు వ‌స‌తి గృహం నిర్మించాల‌నే డిమాండ్ ఎప్ప‌టి నుంచో ఉంది. అదేవిధంగా గ‌త పాల‌న‌లో దెబ్బ‌తిన్న ఆల‌యాల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని కూడా ఇక్క‌డి వారు కోరుకున్నారు. పురోహితుల‌కు క‌నీస పింఛ‌ను అమ‌లు చేయాల‌ని.. కోరుకున్నారు.

అదే స‌మ‌యంలో కార్పొరేష‌న్ ద్వారా.. త‌మ‌కు రుణాలు ఇప్పించాల‌ని కోరుకున్నారు. వేద విద్య పాఠ‌శాల‌ను స‌త్య‌నారాయ‌ణ పురంలో ఏర్పాటు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ల్లాది చేసింది ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో తాము గెలిపించిన‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌మ‌కు ఏమీ చేయ‌లేద‌నే భావ‌న ఇక్క‌డి బ్రాహ్మ‌ణుల్లో క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి

తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు  8919011959 
కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా  care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!

మరింత సమాచారం తెలుసుకోండి: