ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో హామీ ఇచ్చిన నేత‌ల సంఖ్య మామూలుగా లేదు. కీల‌క ప‌ద‌వులు ఇస్తామ‌ని హామీ ఇచ్చిన నేత‌లే ఏకంగా 100 మంది వ‌ర‌కు ఉన్నారు. కీల‌క‌మైన గుంటూరు జిల్లాలో కొంద‌రు కాపు నేత‌ల‌కు జ‌గ‌న్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ప‌ద‌వులు ఇస్తామ‌ని హామీలు ఇచ్చారు. ఆ మాట‌కు వ‌స్తే జిల్లాలో కాపు నేత‌ల‌కే కాదు, క‌మ్మ‌ల‌తో పాటు మ‌రి కొన్ని వ‌ర్గాల నేత‌ల‌కు జ‌గ‌న్ హామీలు చేశారు. చిల‌క‌లూరిపేట‌లో మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, రేప‌ల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మ‌ల్లిఖార్జున రావు, పెదకూర‌పాడు మాజీ ఇన్‌చార్జ్ కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు, ప్ర‌త్తిపాడు మాజీ ఎమ్మెల్యే, పొన్నూరు మాజీ ఇన్ చార్జ్ రావి వెంక‌ట ర‌మ‌ణ ఇలాంటి నేత‌లకు జ‌గ‌న్ చాలా ఆశలే క‌ల్పించారు.

ఇక గుంటూరు జిల్లాలో వైసీపీ కాపు నేత‌ల విష‌యానికి వ‌స్తే ఎన్నిక‌ల‌కు కొద్ది రోజుల ముందు వ‌ర‌కు పెద‌కూర‌పాడు కు ఇన్ చార్జ్‌గా ఉన్న కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడును నిర్దాక్షిణ్యంగా త‌ప్పించేశారు. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తామ‌ని చెప్పి నంబూరు శంక‌ర్రావు కు సీటు ఇవ్వ‌గా ఆయ‌న ఎమ్మెల్యే గా గెలిచారు. ఇప్పుడు మ‌నోహ‌ర్ నాయుడును వైసీపీ అధిష్టానం ప‌ట్టించుకున్న పాపాన పోవ‌డం లేదు. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ యే కాదు.. ఏ ప‌ద‌వి కూడా వ‌చ్చే ప‌రిస్థితి లేదు..

పోనీ జిల్లాలో వైసీపీ నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తోన్న ఇద్ద‌రు ఎమ్మెల్యేల్లో స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు చాలా సీనియ‌ర్. ఆయ‌న 1989లోనే రేప‌ల్లె ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా ఆయ‌న‌కు ఎలాంటి ప‌ద‌వి లేదు. ఇక పొన్నూరులో గెలిచిన కిలారు రోశ‌య్య జూనియ‌ర్ కావ‌డంతో ఆయ‌న‌కు ఏ ప‌ద‌వీ అయితే లేదు. మ‌రి జ‌గ‌న్ ఇచ్చిన మాట ప్ర‌కారం కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడ‌కు ఏదైనా నామినేటెడ్ ప‌ద‌వి ఇవ్వ‌డంతో పాటు... ఇటు అంబ‌టి రాంబాబుకు కీల‌క‌మైన ప‌ద‌వి ఇచ్చి న్యాయం చేస్తారేమో ?  చూడాలి.

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది https://www.indiaherald.com/  కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది ​https://www.indiaherald.com/​​​

మరింత సమాచారం తెలుసుకోండి: