ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు కాస్త హాట్ టాపిక్ గా మారాయి. తెలుగుదేశం పార్టీని ఎలా అయినా సరే ఈ ఎన్నికల్లో ఓడించాలి అనే లక్ష్యంతో అధికార పార్టీ వ్యవహరిస్తుంది. ఈ నేపధ్యంలో చాలా వరకు అధికారులు కూడా సహకరిస్తున్నారు అనే ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. వైసీపీ అగ్ర నేతలు మంత్రుల ఆదేశాలతో అధికారులు చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్రతీ అంశంలో కూడా విపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే టీడీపీ నేతలు కూడా ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు చేస్తున్నారు. 

వస్తున్న ఇబ్బందులను టీడీపీ కీలక నేతలు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళడమే కాకుండా... ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా పంపుతున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా జిల్లా రెవిన్యూ అధికారి ని కలిసిన టిడిపి నేతలు తెనాలి శ్రావణ కుమార్, దూళిపాళ్ల నరేంద్ర అధికార పార్టీ అరాచకాలపై ఫిర్యాదులు చేసారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామం లో ఓట్లు తొలగింపు, వాలెంటీర్లు ప్రచారం పై ఫిర్యాదులు చేసారు. వాలెంటీర్లు ద్వారా వైకాపా నేతలు ప్రచారం చేయిస్తున్నారు అని ఆరోపించారు. 

ఈ సందర్భంగా టీడీపీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పధకాలు ఆగిపోతాయని బెదిరింపులు చేయుస్తున్నారు అని ఆరోపించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు వల్లే కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం గా ఉన్నారు అని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అహాంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడు అని మండిపడ్డారు. దళితుడైన డిప్యూటీ సీఎంను పెద్దిరెడ్డి అవమానపర్చాడు అని ఆరోపించారు. పెద్దిరెడ్డి పైన అట్రాసిటీ కేసు పెట్టాలి అని కోరారు. రాష్ట్రం లో ఉన్న దళితులు అంతా ఆలోచన చేయాలి అని డిమాండ్ చేసారు. దళితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న వైకాపా కు పంచాయతీ ఎన్నికలలో బుద్ది చెప్పాలి అని విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: