పిజ్జా.. ఈ పేరు వినగానే ఎలాంటి వారికైనా నోరు ఊరుతుంది. అందులో వాడే ఐటమ్స్ గానీ, చీజ్ గానీ ఫుడ్ ప్రియులను లాగేసుకుంటుంది. విదేశాల్లో ఎక్కువగా పిజ్జాను తీసుకొనేవారు. కానీ ఇప్పుడు మన దేశంలో కూడా ఈ పిజ్జా ను తింటున్నారు. కాలం మారడంతో అక్కడి అలవాట్లు ఇక్కడకు వచ్చయన్నమాట..అయితే పిజ్జాలో వాడే వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని చాలా మంది అనుకున్నారు. కానీ అటువంటి ప్రమాదాలు ఉండవట.పిజ్జా ను వారానికి ఒకటి తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాదని అంటున్నారు. కొందరు పరిశోధనలు కూడా చేశారు.


వివరాల్లోకి వెళితే.. ఈ పిజ్జా పుట్టు ,పూర్వోత్తరాలను పరిశీలిస్తే..పదో శతాబ్దానికి చెందిన ఓ లాటిన్‌ కథలో పిజ్జా ప్రస్తావన ఉంది. ఈ కథ దక్షిణ ఇటలీ ప్రాంతంలోని గాయిటా పట్టణానికి సంబంధించినది.అయితే రిపోర్టుల ప్రకారం 1500వ సంవత్సరంలో పిజ్జాను కనుగొన్నారు. చవుకగా లభించే ఈ పిజ్జాను నేపుల్స్‌కు చెందిన దిగువ తరగతి ప్రజలు వండుకుని తినేవారు. చీజ్‌కు తోడు టమోటా ముక్కలు పిజ్జా రొట్టెపై టాపింగ్‌ చేసుకుని వారు ఆరగించేవారు. 18 వ శతాబ్దం లో ఈ పిజ్జా షాప్ వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటిలో పిజ్జా లు గుండ్రంగా ఉండేవట..రాను రాను అవి చతురస్రాకారంలో కి మారాయని చెబుతున్నారు.


చవకగా దొరికే పిజ్జాలతో పాటు అత్యంత ఖరీదైనవి కూడా దొరుకుతాయి. ఇప్పటి వరకూ అత్యంత ఖరీదైన పిజ్జా ధర రూ. 7,93,880గా ఉంది... 2013లో డోమినోస్‌ రూపొందించిన డీవీడీ.. పిజ్జా వాసన రావడం విశేషం..ప్రపంచంలోనే అత్యంత వేగంగా పిజ్జాను తయారు చేసేదిగా పేరున్న డోమినోస్‌కు మూడు పెద్ద పిజ్జాలను చేయడానికి కేవలం 47.56 సెకన్లు మాత్రమే పడుతుందట. అయితే పిజ్జా ను తరచూ తీసుకోవడం వల్ల ఏదైనా సమస్యలు వస్తాయా అనే సందేహం అందరికీ కలుగుతుంది. అయితే అధ్యయనాలు ఏం చెబుతున్నాయి అంటే..వారానికి ఓ పిజ్జాను తిన్న వారికి కేన్సర్‌ సోకే అవకాశం తక్కువగా ఉంటుందట.. కొత్త సంవత్సరం రోజు నిమిషానికి 4100 పిజ్జా ఆర్డర్లు వచ్చాయని జొమాటో సీఈవో దీపీందర్‌ గొయెల్‌ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.ఇది పిజ్జా వెనక ఉన్న అసలు కథ..


మరింత సమాచారం తెలుసుకోండి: