ఒకప్పుడు కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో  అన్నది ఎవరికీ తెలియదు అన్న విషయం తెలిసిందే.  ఏకంగా గంటలపాటు కరెంట్ కోతలు విధిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉండేవారు అన్న విషయం తెలిసిందే. కాని ప్రస్తుతం అలాంటి చింత లేకుండా పోయింది.  ఎందుకంటే ప్రస్తుతం దాదాపుగా అన్ని రాష్ట్రాలలో కూడా 24 గంటల లభిస్తోంది దీంతో పాటు సామాన్య ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అయితే ఒకప్పుడు కరెంట్ పోతే మళ్లీ ఎప్పుడు వస్తుందో అని ఆందోళన చెందేవారు ప్రతి ఒక్కరు. కానీ ప్రస్తుతం మాత్రం కరెంటు పోతే ఎక్కడైనా సమస్య ఉందేమో అందుకే పోయింది మరికొద్ది సేపట్లో వస్తుందిలే అని అనుకుంటున్నారు. అంతలా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా 24 గంటల కరెంటు అందిస్తోంది. ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 24 గంటల కరెంటు తమ ప్రజలకు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల 24 గంటల కరెంటు అందించడం విషయంలో మేఘాలయ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఊహించని షాక్ ఇచ్చింది.



 కరెంట్ కొనుగోలు కు చెందిన బాకీలు చెల్లించకపోవడంతో కరెంటు కోతలు విధించేందుకు మేఘాలయ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం మేఘాలయాలో 24 గంటల కరెంటు అందిస్తూ ఉండగా..  ఇక రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు ఏడు గంటల వరకు కోతలు విధించేందుకు మేఘాలయ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపింది. అయితే ఈ ఏడు గంటల కరెంటు కోతలు విడతలవారీగా ఉంటాయని ఒకేసారి ఉండవు  అంటూ మేఘాలయ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా  కరెంట్ కొనుగోలు బాకీలు చెల్లించడానికి  కేంద్ర ప్రభుత్వం మేఘాలయ ప్రభుత్వానికి 13 వందల కోట్లకు పైగా నిధులు సమకూర్చింది. ఈ క్రమంలోనే త్వరలోనే కరెంటు బకాయిలను చెల్లించి కరెంటు కోతలు అధిగమించాలని అక్కడి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: