ఈ మధ్యకాలంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణికులు అందరికీ అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకు వస్తుంది అన్న విషయం తెలిసిందే.  అయితే ప్రస్తుతం ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ సంస్థ ఎన్నో రకాల సర్వీసులు అందిస్తున్నప్పటికీ మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ పోటీ మాత్రం రోజురోజుకూ తీవ్రమవుతుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఆర్టీసీ బస్సుల కంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో సదుపాయాలు ఎక్కువగా ఉండటం.. అంతేకాకుండా ప్రయాణికులను ఆకర్షించడానికి  ప్రైవేట్ ట్రావెల్స్ వివిధ రకాల ఆఫర్లు కూడా ప్రకటిస్తూ ఉన్న  నేపథ్యంలో.. ప్రయాణికులు ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ వైపే మొగ్గు చూపుతున్నారు.



 ఇక అదే సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క పోటీని తట్టుకోలేక ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ రోజురోజుకు నష్టాల్లో కూరుకు పోతుంది. ఈ క్రమంలోనేప్రయాణికులు అందరిని ఆకర్షించే విధంగా ఏపీఎస్ ఆర్టీసీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల కోసం పలు రకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకురావడమే కాదు  వారి సౌకర్యార్థం విస్తృతమైన సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క పోటీని తట్టుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ కూడా వినూత్నంగా ఆలోచించి కీలక నిర్ణయం తీసుకుంది.



 ప్రైవేట్ ట్రావెల్స్ తరహాలోనే ఆఫర్లు ప్రకటించేందుకు సిద్ధమయ్యింది ఏపీఎస్ఆర్టీసీ. ఇందులో భాగంగానే ఎర్లీ బర్డ్ అని ఆఫర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఏపీఎస్ఆర్టీసీ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఆఫర్ ప్రకారం ఏసీ బస్సులో  10% చార్జి  రాయితీ లభిస్తుంది. ఇక నాన్  ఏసీ  బస్సులో  కూడా 10% రాయితీ లభించనున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు రోజుల ముందుగా అడ్వాన్సు రిజర్వేషన్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే మార్చి 31 వరకు ఈ ఆఫర్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: