కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పార్టీని బ‌తికించుకునేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్రంగా శ్ర‌మించిన విష‌యం తెలిసిందే. అయితే.. అదేస‌మ‌యంలో పార్టీలోని కొంద‌రు.. త‌మ భ‌విత‌వ్యం కోసం శ్ర‌మించ‌డం మ‌రో కోణం. ఇలాంటిదే.. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో చోటు చేసుకుంది. ఇక్క‌డ గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేవ‌లం 25 ఓట్ల‌తో ప‌రాజ‌యం పాలైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు .. త‌న ప‌ట్టును నిరూపించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో కేవ‌లం సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం పైనే దృష్టి పెట్టారు.

వాస్త‌వానికి చంద్ర‌బాబు నుంచి ఆయ‌న‌కు ఉన్న ఆదేశాల మేర‌కు.. విజ‌య‌వాడ‌లోని ప‌శ్చిమ‌, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఆయ‌న ప‌ర్య‌వేక్షించి.. పార్టీని పుంజుకునేలా చేయాల్సి ఉంది. అయితే.. అనూహ్యంగా ఆయ‌న మాత్రం సెంట్ర‌ల్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆయ‌న సెంట్ర‌ల్ లో పుంజుకోవాల ‌నే ఏకైక ల‌క్ష్యాన్ని నిర్ణ‌యించుకోవ‌డ‌మేన‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పాతిక ఓట్ల తేడాతో ఓడిపోయిన తాను.. ఇప్ప‌టికీ.. స‌ద‌రు ఓట‌మిని జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగుతున్నారు.

అయితే.. ఇక్క‌డ ప్ర‌ధాన ట్విస్ట్ ఏంటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీ మ‌రింత దిగ‌జారినా.. త‌న ప‌ట్టు త‌ప్ప‌కుండా చూసుకోవాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగ‌డమే. అందుకే ఆయ‌న తాజాగా జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో త‌న వ‌ర్గం వారినే అభ్య‌ర్థులుగా ఎంపిక చేసుకున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రికీ ఆర్థికంగా సాయం చేయ‌డంతోపాటు.. త‌న‌వంతుగా ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌చారం చేసి పెట్టారు. ఈ నేప‌థ్యంలో సెంట్ర‌ల్ లో మాత్ర‌మే టీడీపీ గ‌ట్టి పోటీ ఇస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది.

మ‌రోవైపు.. ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు త‌న‌కు ప్ల‌స్‌గా మార‌తాయ‌ని భావించిన ఎమ్మెల్యే విష్ణు పెద్ద‌గా ప్ర‌చారంపై జోక్యం చేసుకోలేదు. ఈ నేప‌థ్యంలో ఇది కూడా బొండా ఉమాకు క‌లిసి వ‌స్తుంద‌ని అంటున్నారు. విజ‌య‌వాడ మేయ‌ర్ పీఠం టీడీపీకి ద‌క్కినా.. ద‌క్క‌క‌పోయినా.. సెంట్ర‌ల్‌లో తాను ఎంచుకున్న అభ్య‌ర్థులు గెలిస్తే.. చాల‌ని బొండా భావించ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: