నేటి సమాజంలో సరైన టైంకి ఆహారం తీసుకోక అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఇక కొంతమంది లావుగా తయారవుతున్నారు. ఇక వాళ్ళు సన్నగా కావాలని మళ్ళి డైట్ ని పాలో అవుతుంటారు. అయితే డైటింగ్ చేసేటప్పుడు తినే పండ్ల ఎంపిక చాలా ముఖ్యం. డైటింగ్ చేసే సమయంలో తినకూడని కొన్ని పండ్లను చూద్దాం. అరటి పండును సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మీరు బరువు తగ్గడం గురించి ఆలోచిస్తుంటే, అరటిపండు తినడానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. అరటిలో 150 కేలరీలు ఉంటాయి. ఇది సుమారు 37.5 గ్రాముల కార్బోహైడ్రేట్‌కు సమానం. మీరు ప్రతిరోజూ 2 నుండి 3 అరటిపండ్లు తింటే అది ఖచ్చితంగా మీ బరువును పెంచుతుంది.

ఇక ద్రాక్షలో చక్కెర, కొవ్వు రెండూ అధికంగా ఉంటాయి. అంతేకాక అందులో 100 గ్రాముల ద్రాక్షలో 67 కేలరీలు, 16 గ్రాముల చక్కెర ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. ముడి ద్రాక్ష కంటే ఒక గ్రాము ఎండుద్రాక్షలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. ఒక కప్పు ఎండుద్రాక్షలో 500 కేలరీలు ఉంటాయి. ఇది ఖచ్చితంగా మీ బరువును ప్రభావితం చేస్తుంది. అందువల్ల, డైటింగ్ చేసేటప్పుడు ఎండుద్రాక్షను తీసుకోకపోవడం మంచిది.

ఇక అవకాడో కూడా అధిక కేలరీలు కలిగిన పండు. 100 గ్రాముల పండ్లలో  160 కేలరీలు ఉంటాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. కానీ మీరు ఎక్కువ ఈ పండ్లను తీసుకుంటే బరువు పెరుగుతారు.  ఒక కప్పు మామిడిలో 99 కేలరీలు ఉంటాయి. ఇందులో సుమారు 23 గ్రాముల సహజ చక్కెర 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అందువల్ల మామిడి పండ్లు తినడం బరువు తగ్గాలనుకుంటున్న వారికి మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: