జనసేన పార్టీ అధినేత, భారతీయ జనతాపార్టీకి మిత్రుడైన పవన్ క‌ల్యాణ్ మహా శివరాత్రిని పురస్కరించుకొని శివరాత్రి జాగరణ చేయనున్నారు. జనసేన పార్టీ నుంచి ఇండియా హెరాల్డ్ కు విశ్వసనీయ సమాచారం అందింది. శివరాత్రి రోజు కోటయ్యను  తలుచుకుంటూ, అర్థరాత్రి సమయంలో జరిగే లింగోద్భవాన్ని కనులారా వీక్షిస్తూ ఆ రాత్రంతా జాగరణ చేస్తే  శివసన్నిధికి చేరుకుంటామని, మరుజన్మ ఉండదనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నమ్మకంతోనే పవన్ శివరాత్రి జాగరణ చేయనున్నారు.

జ‌నాలు ఓట్లేశామంటున్నారు... ఎందుకు గెల‌వ‌లేదో అర్థం కావ‌డంలేదే!!
జాగరణ సమయంలో అందరూ శివుణ్ని తలుచుకుంటూ ధ్యానం చేస్తారు. ఓం నమఃశివాయ హరహర మహాదేవ శంభో శంకరా అంటూ నామాన్ని ఉచ్ఛరిస్తుంటారు. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా కేవలం శివయ్యపైన ఆలోచనలు ఉంచుతారు. పవన్  విషయానికి వస్తే జాగరణ చేసే సమయంలో...  హాహాహా... ఓం నమశ్శివాయ... ప్రజలంతా ఓట్లేశామంటున్నారు.. అయినా రెండు అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోవడమేంటో ఇప్పటికీ అర్థంకావడంలేదు.. గెలిచిన ఒక ఎమ్మెల్యే వైసీపీ గూటికి చేరుకున్నాడు.

న‌మ్మ‌క‌మేనా? న‌మ్మొచ్చా?
ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి మద్దతు బాగానే ఉంది. భారతీయ జనతాపార్టీ మిత్రపక్షంగా ఉంది. అవసరం కోసం మనల్ని వాడుకుంటుందా?  లేక నిజంగానే మనల్ని నమ్మకమైన మిత్రపక్షంగా చూస్తోందా? అనేది అర్థం కావడంలేదే. నాదెండ్ల మనోహర్ కూడా ఏమీ చెప్పలేకపోతున్నాడు. చూద్దాం అంటున్నాడు. అన్నయ్య కనుక పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయకుండా ఉంటే ఈపాటికి ఒక రేంజ్‌లో ఉండేవాడు. అనవసరంగా పార్టీని కలిపేశాడు. కనీసం నేనన్నా పార్టీని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే ఎప్పటికైనా కింగ్ మేక్‌ కావచ్చు. తర్వాత కింగ్ కావచ్చు. పుర‌పాల‌క సంఘాల ఎన్నిక‌ల్లో ఎన్ని గెలుచుకుంటామో అంచ‌నాకు రాలేక‌పోతున్నాను. ఒక‌వైపు అమ‌రావ‌తి రాజ‌ధానికి మ‌ద్ద‌తిచ్చాను. మ‌రోవైపు నా మిత్ర‌ప‌క్షం బీజేపీ నోరు మెద‌ప‌డంలేదు. వారి మ‌న‌సులో మాట నాకు కూడా చెప్ప‌డంలేదు. ఈ ఆలోచ‌న‌ల్లో ఉండ‌గానే తెల్ల‌వారింది.. జాగ‌ర‌ణ ముగిసిపోయింది. ఓం న‌మశ్శివాయ అనుకుంటూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రోజువారీ కార్య‌క్ర‌మాల‌కు ఉప‌క్ర‌మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: