భారత దేశంలో వివాహ బందానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మన పూర్వ కాలం నుంచి వివాహ బంధంతో ఇద్దరు ఆడా,మగ కలిసి జీవితాన్ని ప్రారంభిస్తారు. దీనికి పెద్దల అంగీకారం కూడా ఉంటుంది. డి.ఎమ్.కె. సభ్యురాలు కనిమొళి వేసిన ఒక ప్రశ్నకు   వివాహ సాంప్రదాయ కట్టుబాట్లను పాటించే భారత దేశంలో తాళికట్టి పెళ్లి చేసుకున్న భర్త, తన భార్యకు ఇష్టం లేకున్నా బలవంతంగా అనుభవిస్తే అది నేరం కాదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది. వైవాహిక సంబంధంలో ఉన్న ఇద్దరి మధ్య జరిగే బలవంతపు కలయికను అత్యాచారంగా పరిగణించలేమని  సమాధానం ఇచ్చింది.
 


డి.ఎమ్.కె. సభ్యురాలు కనిమొళి

kanimozhi

భర్త బలవంతంగా అనుభవిస్తే, అది అత్యాచారం (రేప్) కాదనే మినహాయింపు ఐపీసీలోని 375 సెక్షన్‌‌లో ఉందని గుర్తు చేస్తూ, దీన్ని సవరించేందుకు బిల్లు ఏమైనా తెస్తున్నారా? అని డీఎంకే సభ్యురాలు కనిమోళి వేసిన ప్రశ్నకు    కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ చౌదరి ఈ మేరకు సహాయమంత్రి హరిభాయ్ చౌదరి ఈ మేరకు సమాధానమిచ్చారు.  


భార్యకు ఇష్టం లేకుండా బలవంతపెడితే, అది విదేశాల్లో నేరమని, భారత్లో నెలకొన్న భిన్నమైన సామాజిక స్థితిగతుల నేపథ్యంలో దీనిని మనదేశంలో రేప్గా నిర్వచించలేమని, చట్ట సవరణ ఆలోచనేమీ తాము చేయడం లేదని హరిభాయ్ వెల్లడించారు. మారిటల్ రేప్ను నేరంగా చేస్తే, ఎన్నో సమస్యలు తలెత్తుతాయని, ఇండియాలో కుటుంబ విలువలకు ఇది విఘాతమని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: