సీజనల్ మార్పుల వల్ల మన శరీరంలో వ్యాధినిరోధక శక్తి క్రమంగా తగ్గుతుంది. ముఖ్యంగా వాతావరణం కొద్దిగా చల్లబడిందంటే చాలు వైరల్ ఫీవర్ మరియు కామన్ కోల్డ్ వంటి ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. అంతే కాదు, ఇవి ఇతరుకలు కూడా చాలా తేలికగా..సులభంగా వ్యాపింపచేస్తాయి . అలాంటి పరిస్థితిలో ఇమ్యూనిటి బూస్టింగ్ ఫుడ్స్పెం చే ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం. అయితే మనంలో చాలా మందికి ఈ ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ తినే ఓపిక కూడా కలిగి ఉండరు. అందువల్ల, మరి వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవడం ఎలా? ఆరోగ్యం కోసం ఒక 5నిముషాలు వెచ్చించి స్వతహాగా ఇమ్యూన్ బూస్టర్స్ ను మీరే హెల్తీగా తయారుచేసుకోండి...సింపుల్ జ్యూసులు వ్యాధినిరోధకతను పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. మరి వీటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకోవాలి.  


వైరల్ ఫీవర్ 

how to prevent viral fever

వైరల్ ఫీవర్ లక్షణాలు: వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు వివిధ రకాల లక్షణాలను చూపుతాయి. కానీ ముఖ్యంగా కనిపించే లక్షణాలు, జ్వరం, అలసట, వికారం, ఒళ్లునొప్పుల, రాషెస్, తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి, ఉదరంలో నొప్పి మొదలగు లక్షణాలు కనబడుతాయి.

వైరల్ ఫీవర్ తీవ్రంగా ఉన్నప్పుడు: వైరల్ ఫీవర్ అతి ప్రమాధకరం. పేషంట్ చాల బలహీనంగా ఉన్నప్పుడు, ఆహారాలు పూర్తిగా తీసుకోలేనప్పుడు, వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయించాలి. యాంటీబయోటిక్స్ తో నయం కానప్పుడు వెంటనే హాస్పిటల్లో చేర్పించాలి.

వైరల్ ఫీవర్ యొక్క మరో లక్షణం, శ్వాసలో ఇబ్బంది కలగడం మరియు ఇది ఈ సమస్య మరో 5రోజులు పెరుగుతుంది వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి

 వైరల్ ఫీవర్ ట్రీట్ తగ్గించుకోవడానికి తాజా కొత్తిమీరతో తయారుచేసిన టీ , మెంతి వాటర్ త్రాగడం వల్ల వైరస్ చాలా తర్వాత నాశనం అవుతుంది . మరియు రైస్ వాటర్ లేదా రవ్వ గంజి తీసుకోవచ్చు.

బీటాకెరోటిన్, యాంటీయాక్సిడెంట్స్ మరియు విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న క్యారెట్స్ వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి . ఈ ఇమ్యూనిటి బూస్టింగ్ జ్యూస్ ను తయారుచేయడానికి ముందుగా 4 క్యారెట్స్ ను సిద్దంగా ఉంచుకోండి.. 

నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి, ఇది ఇమ్యూనక్ బూస్టింగ్ ఫుడ్. మరియు సిట్రిక్ యాసిడ్ శరీరంలోని పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. మరి 3 నిమ్మకాయలను సిద్దం చేసుకోవాలి. 

ఇమ్యూన్ బూస్టింగ్ జ్యూస్ కు అల్లం కూడా జోడించడాలి. ఎందుకంటే?అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల ఇది మొత్తం శరీరం యొక్క నొప్పేలను నివారించడానికి, వికారంను నయం చేయడానికి సహాయపడుతుంది కాబట్టి, కొద్దిగా అల్లం చేర్చడం మంచిది. 


వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో వెల్లుల్లి బాగా సహాయపడుతుంది. ఎందుకంటే వెల్లుల్లిలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . వెల్లుల్లి లేకుండా ఇమ్యూన్ బూస్టింగ్ జ్యూస్ తయారవ్వదు. 

నిద్ర సరిపడా నిద్రపోవడం వల్ల శరీరం మరియు మనస్సుకు తగినంత విశ్రాంతి అందుతుంది. దాంతో త్వరగా కోలుకుంటారు. నిద్రలేమి వ్యాధినిరోధక శక్తిని తగ్గించేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: