గుంటూరు, కృష్ణా తూర్పుగోదావరి జిల్లాల్లో కరోనా కలకలంపై స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కీలక వ్యాఖ్యలు చేసారు. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి ఆళ్ల నాని... గుంటూరు, కృష్ణా తూర్పుగోదావరి జిల్లాల DMHO లు డాక్టర్ యాస్మిన్, డాక్టర్ సుహాసినిడాక్టర్ గౌరిస్వరరావులతో ఫోన్ లో మాట్లాడారు. గుంటూరు జిల్లా పొన్నూరు, తెనాలిలో కరోనా పాజిటివ్ కేసులు అధికం కావడంతో నివారణకు దృష్టి  పెట్టాలని DMHO కు ఆయన సూచించారు.

కరోనా బాధితులకు అన్ని విధాలుగా వైద్య సదుపాయం కల్పించాలని వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న కరోనా బాధితులకు మెడికల్ కిట్స్ అంద చేయాలని DMHO డాక్టర్ యాష్మిన్ కు సూచించారు. తెనాలిలో మునిసిపల్ సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడంతో వారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచాము అని చెప్పారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ఉన్న వారికి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేయిస్తున్నాం అన్నారు. పొన్నూరు లోని ప్రైవేట్ స్కూల్ లో విద్యార్థులకు ర్యాండమ్ గా  కరోనా పరీక్షలు చేయాలని వైద్య అధికారులకు మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేసారు.

స్టూడెంట్స్, పేరెంట్స్ ఎవరు భయపడవద్దు.. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. కృష్ణా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మెడికల్ టీమ్స్ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, ఇంటింటికి వెళ్లి సెర్వే టీమ్స్ వివరాలు సేకరించాలని పేర్కొన్నారు. జగ్గయ్యపేట ప్రాంతంలో కరోనా బాధితులను హోమ్ క్వారంటైన్ కు తరలించామన్నారు. కరోనా సోకిన బాధితులు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు అని స్పష్టం చేసారు. వారికీ అవసరం అయినవైద్యం అందిస్తున్నామని వివరించారు. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ లో 40మంది కరోనా బాధితులకు ప్రత్యేకంగా వైద్య సదుపాయం కల్పించామని తెలిపారు.

కృష్ణా జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో అన్ని ముందోస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొనసీమ ప్రాంతం మల్కిపురం జిల్లా పరిషత్ హై స్కూల్ లో 12మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది అన్నారు. విద్యార్థులను హోమ్ క్వారంటైన్ కు తరలించామని చెప్పారు. జిల్లా పరిషత్ హై స్కూల్ లో పూర్తిగా శానిటేషన్ చేయించి అన్ని జాగ్రత్తలు చేపట్టామని అన్నారు. ప్రేమరీ, సెకండరీ కాంటాక్ట్ పై కూడ మెడికల్ టీమ్స్ సెర్వే చేస్తున్నారు అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: