ఈ మధ్యకాలంలో అన్ని రకాల చార్జీలు పెరిగిపోతున్నాయి.. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారీగా పెట్రోల్ చార్జీలు పెంచింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ప్రస్తుతం దేశంలో పెట్రోల్ చార్జీలను ఏకంగా సెంచరీకి దగ్గరగా ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో అయితే పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టాయి కూడా. అయితే కేవలం పెట్రోల్ చార్జీలు పెరగడమే కాదు అటు నిత్యావసరాల ధరలు కూడా పెరిగిపోతుండడంతో సామాన్య ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు.



 అయితే ఇక పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోవడం అటు కూరగాయల ధరలు కూడా అంతకంతకూ పెరిగి పోతుండటంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అదేసమయంలో పెట్రోల్ ధరలు కూడా పెరిగిపోతుండటం సామాన్య ప్రజలను దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే వంటగ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి అన్న విషయం తెలిసిందే.  ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరికొన్ని రోజుల్లో కరెంటు చార్జీలు కూడా పెరిగిపోతున్నాయి అని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం ఊపందుకుంది.



 ఈ క్రమంలోనే ఇక సామాన్య ప్రజలందరూ అయోమయం లో పడిపోయారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు వంట గ్యాస్ ధర లతో ఇబ్బందులు పడుతున్న తమకు ఇక ఇప్పుడు కరెంటు చార్జీలు పెరిగితే మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు తమ పరిస్థితి అవుతుంది అంటూ సామాన్య ప్రజలు ఆందోళనలో మునిగిపోతున్నారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి కరెంటు చార్జీల పెంపు పై క్లారిటీ ఇచ్చారు. కరెంట్ ఛార్జీలు పెరుగుతాయని అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఇలాంటి ప్రచారాన్ని నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దు అంటు జగదీష్ రెడ్డి తెలిపారు.  ఒకవేళ ఛార్జీల పెంచవలసి వస్తే ముందుగా ప్రజలకు తెలియజేస్తాము అంటూ  శాసనమండలి వేదికగా తెలిపారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: