తెలంగాణలో రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన మారకపోతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని కొంతమంది అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో విభేదాలే దీనికి ప్రధాన కారణమని కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కాస్త దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని తప్పులు కూడా ఎక్కువ చేస్తున్నారు.

రేవంత్ రెడ్డిని పక్కన పెట్టే ప్రయత్నం ఆయన చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొన్ని సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రచారం చేయకపోతే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోయే అవకాశాలు కూడా ఉండవచ్చు అనే భావన ఉంది. జానారెడ్డి భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీలను ఎదుర్కొనే విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తున్న సరే ఆయనకు మాత్రం రేవంత్ రెడ్డి నుంచి సహకారం రావడం లేదు. ఇక తాజాగా జరిగిన బహిరంగ సభలో కూడా రేవంత్ రెడ్డి పెద్దగా ఆసక్తి చూపించలేదు.

దీంతో అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావడం లేదు. రేవంత్ రెడ్డి కొన్ని కొన్ని విషయాల్లో బిజెపి నేతలకు భయపడుతున్నారని అందుకే రేవంత్ రెడ్డి బయటకు రావడం లేదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు, ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు వేరు ఇప్పటి వరకు జరిగింది వేరు ఇక ముందు జరిగేది వేరు అనేది కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి విషయంలో ఆయనకు ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందని జాతీయ స్థాయి నాయకులు ఆయనతో మాట్లాడి ముందుకు నడిపించాలని లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ గొంతు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండదని అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రసంగాలకు మంచి ఆదరణ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమిది అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: