నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థి పేర్లను ఖరారు చేసే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించింది. తాజాగా టీఆర్ఎస్ పార్టీ కూడా తన అభ్యర్థిని ఖరారు చేసింది. సాగర్ trs అభ్యర్థిగా నోముల నర్సింహాయ్య తనయుడు భగత్ పేరు ఖరారు అయ్యింది. మధ్యాహ్నం తర్వాత ఆయన పేరును పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.


 నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది డిసెంబర్‌లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇప్పుడు ఆయన కుమారుడికే టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే సాగర్ ఉప ఎన్నిక కోసం తొలిరోజు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. ఐదుగురు స్వతంత్ర (ఇండిపెండెంట్‌) అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు గడువు ఉంది.నామినేషన్లకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో ఎట్టకేలకు టీఆర్ఎస్ పార్టీ తమ నాగార్జునసాగర్ అభ్యర్థిని ఖరారు చేసింది. ప్రయోగాలకు పోకుండా చనిపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే వారసుడికే పట్టం కట్టింది.                                      

తాజాగా నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ పేరును ఆ పార్టీ ఖరారు చేసింది.తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్వయంగా నోముల భగత్ కు బీఫాం అందజేశారు.టీఆర్ఎస్ నుంచి ఈ టికెట్ కోసం ఈసారి భారీ పోటీ నెలకొంది. సాగర్ సీటు కోసం ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి, ఇతర నేతలు కోటిరెడ్డి, గురువయ్య యాదవ్, రంజిత్ యాదవ్ , బాలరాజు యాదవ్ తదితరులు పోటీపడ్డారు.


వీరందరి పేర్లను పరిశీలించిన కేసీఆర్ నియోజకవర్గంలో సర్వేలు చేయించారు. నల్గొండ జిల్లా పార్టీ నేతలతోపాటు ఇన్ చార్జులు, ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నారు.పార్టీ శ్రేణుల మనోభావాలకు తోడు నోముల నర్సింహయ్య పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన వారసుడికే అవకాశం ఇవ్వడం మేలు అని టీఆర్ఎస్ అధినేత భావించారు. దీంతో నోముల భగత్ కే టికెట్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: