నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.. అయితే అధికార టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మూడో ఓపెన్ నీకు ఇది. మొదట ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన హుజూర్నగర్ స్థానానికి ఆయన నల్గొండ ఎంపీగా ఎన్నిక కావడంతో ఉప ఎన్నిక జరిగింది.. అక్కడ అనూహ్యంగా టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఉప ఎన్నికలు జరగగా అక్కడ ఆమె ఆయన భార్య ను రంగంలోకి దింపినా ఫలితం లేకుండా పోయింది. అక్కడ బీజేపీ తరఫున పోటీ చేసిన రఘునందన్ రావు విజయం సాధించారు. అయితే అక్కడ రెబల్స్ బెడద ఎక్కువగా ఉండడంతో ఓట్లు చీలి బీజేపీ సాయం అందింది అనే ప్రచారం జరిగింది..ఈ క్రమంలోనే ఎప్పుడూ ఉప ఎన్నికల విషయంలో అంతా ఆసక్తిగా బయటకు వచ్చి ప్రచారం తదితర అంశాలలో పాల్గొనని కెసిఆర్ నిన్న బీఫామ్ అందించేందుకు తెలంగాణ భవన్ కు రావడం ఆసక్తికరంగా మారింది.

 నిజానికి దుబ్బాకలో కెసిఆర్ ప్రచారానికి వెళతారని అనుకున్నారు. కానీ అంతా హరీష్ రావు మీద వదిలేసి కేసీఆర్ సైలెంట్ గానే ఉండిపోయారు. ఖచ్చితంగా గెలిచి తీరుతాను మన నమ్మక,మో లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ కానీ అదే సమయంలో వరంగల్ లో ఒక బహిరంగ సభ పెట్టి ప్రసంగించారు కానీ దుబ్బాక వెళ్లి ప్రచారం చేసింది లేదు. దీంతో సాగర్ ఉప ఎన్నికల్లో ఇలాంటి తప్పు చేయకూడదు అని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే ప్రచారానికి వస్తానని ఇప్పుడే మాట ఇచ్చారట.. దుబ్బాక లో తన ప్రచారం చేయకపోవడం వల్ల ఓడిపోయిన మాట వాస్తవమే కాబట్టి సాగర్ లో అలాంటి తప్పు మళ్ళీ రిపీట్ చేయను అని సాగర్ నేతలకు హామీ ఇచ్చారట. 

అదీకాక అభ్యర్థికి బి ఫాం ఇవ్వడంతోపాటు ఎన్నికల ఖర్చు కోసం 28 లక్షల చెక్కు కూడా అందివ్వడం ఆసక్తికరంగా మారింది. అలాగే ఇక్కడ పోటీ కోసం చివరి వరకు పోటీ పడిన ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నేతలను ఆయన బుజ్జగించి ఎమ్మెల్సీ పదవుల ఆశ కూడా చూపించారు. ఇప్పటికే చిన్నారెడ్డి ఎమ్మెల్సీగా ఉండగా మళ్ళీ ఎమ్మెల్సీ ని చేస్తానని హామీ ఇచ్చారట. దుబ్బాక విషయంలో ఇలా టికెట్ ఆశించిన నేత చివరి నిమిషంలో కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ నుంచి పోటీ పడ్డారు. అక్కడి నుంచి ఓట్లు చీల్చడంతో సుమారు 1000 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిపాలు లావలసిన పరిస్థితి ఏర్పడింది. దుబ్బాక ఓటమితో కెసిఆర్ కొత్త పాఠాలు నేర్చుకుని ఫాం హౌస్ కు పరిమితం కాకుండా ప్రచారంలో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: