ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు ఎన్నో రోజుల నుంచి బిజెపి జనసేన పార్టీలు కూటమి గా ఏర్పడి ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇక ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు..  అయితే గత కొన్ని రోజుల నుంచి బీజేపీ-జనసేన నేతల మధ్య వివిధ రకాల వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయాయి. ఈ క్రమంలోనే ఇక బీజేపీ జనసేన పొత్తు చీలిపోవడం ఖాయమని అనుకున్నారు అందరు. కానీ ఇటీవలే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ను ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. అయితే పవన్ కళ్యాణ్ ను బిజెపి  ముఖ్యమంత్రి అంటూ ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.



 అయితే సాధారణంగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయే విజయసాయిరెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ తనదైన రీతిలో విమర్శలు చేశాడు.  ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో పోస్టులు పెడుతూ ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడుతూ ఉంటారు వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి. అయితే ఇటీవలే పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అంటూ బీజేపీ ప్రకటించడంపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పదునైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.



 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది తిరుపతి ఉప ఎన్నిక అంటూ గుర్తు చేసిన విజయసాయిరెడ్డి... కాబోయే సీఎం ఫలానా అంటూ బిస్కెట్ వేయడం కాక పట్టడం కాకపోతే ఇంకేమిటి అంటూ ప్రశ్నించారు.. సీఎం సీటు ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేదు.. ఇక ఆ ఆఫర్ తీసుకునే పార్టీకి అసలు రాష్ట్రంలో ఉనికే లేదు.. అంటూ విమర్శలు గుప్పించారు విజయసాయి రెడ్డి. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలిందంట.. కనీసం ఎమ్మెల్యే కూడా కానీ వాడు అసలు సీఎం l అవుతాడా అంటూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశాడు  .

మరింత సమాచారం తెలుసుకోండి: